వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: కీలక అంశాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేవ 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మొదట తన ప్రసంగాన్ని హిందీలో, ఆ తర్వాత ఇంగ్లీషులో కొనసాగించారు. ఈ సందర్భంగా, మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని అన్నారు.

Recommended Video

73rd Independence Day : మెరుగైన ఇండియా ని నిర్మిద్దాం || Our Country-Our Responsibility || Oneindia

మహనీయుల త్యాగం కారణంగా, మనమందరం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా కరోనా వారియర్లను అభినందించారు రాష్ట్రపతి రామ్ ‌నాథ్ కోవింద్. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఈ మహమ్మారిపై పోరు చేయాలని రాష్ట్రపతి కోవింద్ పిలుపునిచ్చారు.

President Ramnath Kovind Salutes the covid Warriors in his Independence day speech

మహాత్మా గాంధీ మన స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గదర్శి కావడం మన అదృష్టం. ఒక సాధువు, అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రాజకీయ నాయకుడి మధ్య సమన్వయం భారతదేశంలో మాత్రమే సాధ్యమైందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాలు ఇంతకుముందులా జరగవు. దీనికి కారణం స్పష్టంగా ఉంది. ప్రపంచమంతా ప్రాణాంతకమైన వైరస్‌తో ముడిపడి ఉంది, ఇది జీవితానికి భారీ నష్టాన్ని కలిగించింది, అన్ని రకాల కార్యకలాపాలకు ఆటంకం కలిగించిందని రాష్ట్రపవతి వ్యాఖ్యానించారు.

కరోనాతో నెలకొన్న కష్టకాలంలో కేంద్రం అనేక పథకాల ద్వారా సాయం చేసిందని అన్నారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న యోధులకు దేశం రుణపడి ఉంటుందని తెలిపారు. వందేభారత్ కార్యక్రమం ద్వారా 10 లక్షల మందికిపైగా భారతీయులను స్వదేశానికి చేరుకున్నారని రాష్ట్రపతి తెలిపారు.

2020 మనకు ఎన్నో పాఠాలు నేర్పుతోందని, ప్రజారోగ్య వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. కరోనా వేళ ఇంటి నుంచి పని, ఈ లెర్నింగ్ బాగా పెరిగాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుసంధానమై జీవించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

భారత్-చైనా సరిహద్దులో గల్వాన్ వద్ద చోటు చేసుకుంటున్న ఘర్షణలో అమరులైన భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. ఇక రామమందిర నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ.. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును దేశ ప్రజలంతా స్వాగతించారని అన్నారు. మందిర నిర్మాణం కూడా ప్రారంభమైందని గుర్తు చేశారు.

English summary
President Ramnath Kovind Salutes the covid Warriors in his Independence day speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X