వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్యాణ్ సింగ్ మెడపై కోడ్ కత్తి:ఈసీ నివేదికను హోంశాఖకు పంపిన రాష్ట్రపతి, చర్యలు తీసుకొనేందుకే మొగ్గు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతోంది. తన, మన, పర అనే భేదం లేకుండా ... రాజకీయ నేతలు, రాజ్యాంగబద్ధ ప్రతినిధుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవల రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ .. తిరిగి మోదీ ప్రధాని కావాలని ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నివేదించింది. కల్యాణ్ సింగ్ .. ఫుటేజీ పరిశీలించిన రాష్ట్రపతి, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

Presidents Move Signals Trouble For Governor Kalyan Singh Over PM Praise

గవర్నర్ పై చర్యలు ?
రాష్ట్రపతి సిఫారసుకు మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపితే .. స్వతంత్ర భారతదేశంలో ఓ గవర్నర్‌పై చర్య తీసుకొన్న ప్రెసిడెంట్‌గా రామ్ నాథ్ కోవింద్ రికార్డు సృష్టిస్తారు. తన విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం వచ్చిన వెంటనే .. ఈసీ నివేదికను పరిశీలించి తగు చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రికి ఫైల్ పంపించారు రాష్ట్రపతి.

Presidents Move Signals Trouble For Governor Kalyan Singh Over PM Praise

గతంలో ఎన్నడూ జరగలేదు
దేశంలో ఇదివరకు ఓ గవర్నర్, ప్రధానమంత్రికి మద్దతుగా మాట్లాడలేదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదు. ' రాజ్యాంగబద్ధ హోదాలో ఉంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించొద్దని' రాష్ట్రపతి భవన్ వర్గాలు స్పష్టంచేశాయి. దీంతో కల్యాణ్ వైఖరిపై రాంనాథ్ గుస్సా మీద ఉన్నారని అర్థమవుతోంది. కల్యాణ్ సింగ్ వ్యాఖ్యలను మీడియాలో చూసి కల్పితమనుకొన్నారు. అయితే ఈసీ నుంచి నివేదిక వచ్చాక .. ధ్రువీకరించుకొని చర్యలకు ఉపక్రమించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకొని .. ఎన్నికల విధుల్లో గవర్నర్ కల్యాణ్ సింగ్ ను తొలగించేందుకు ప్రధాని మోదీ కూడా అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

English summary
Kalyan Singh could become the first Governor to face action, on the President's recommendation, after he was on camera campaigning for Prime Minister Narendra Modi ahead of the national election. The Election Commission had assessed that the Rajasthan Governor had violated the rules of his constitutional post, after which President Ram Nath Kovind has sent the file to the government for approval
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X