వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2005లో యూపీఏ... 2019లో ఎన్డీఏ... ఒకే తరహా.... మళ్లీ మహలో ఎన్నికలేనా....

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనతో సుస్థిర ప్రభుత్వం వైపు అడుగులు వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. గతంలో జరిగిన బీహార్ అనుభవంతో రాష్ట్రపతి పాలన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో 2005లో బీహార్ జరిగిన ఎన్నికల్లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే...తాజగా అదే నిర్ణయాన్ని నేటి ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది... దీంతో ఒకప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు పీఎం నరేంద్రమోడీ వంతైంది.

 మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: మనుగడ లేని అసెంబ్లీ, అప్పటి వరకు అంతే.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: మనుగడ లేని అసెంబ్లీ, అప్పటి వరకు అంతే..

అప్పుడు యూపీఏ... నేడు ఎన్డీఏ...

అప్పుడు యూపీఏ... నేడు ఎన్డీఏ...

ఇటివల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపార్టీకి ప్రజలు సంపూర్ణ మెజారీటీ ఇవ్వకపోవడంతో పాటు బీజేపీ-శివసేన పార్టీల వైఖరి మూలంగా ఆ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు దారి తీశాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలు 2005లో జరిగిన బీహార్ రాష్ట్రంలో జరిగిన పరిణామాల వలే అనిశ్చితిని గుర్తుకు తెస్తున్నాయి. అయితే అప్పుడు యూపీఏ ప్రభుత్వంలోని ప్రధాని మన్మోహన్ సింగ్ ఇదే తరహాలో బీహార్ అసెంబ్లీని రద్దు చేయగా ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయానికి సాక్షిభూతంగా నిలుచే అవకాశాలు కనిపిస్తున్నాయి..

బీహార్‌లో ఏం జరిగింది....

బీహార్‌లో ఏం జరిగింది....

2005 ఫిబ్రవరి నెలలో జరిగిన బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలుండగా....ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు. అయితే ఎన్డీఏ కూటమీగా పోటి చేసిన బీజేపీ-జేడీయూ కూటమీ 92స్థానాలను దక్కించుకంది. ఇక రెండవ అతిపెద్ద పార్టీగా ఆర్‌జేడీ 75 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు, ఎల్‌జేపీ 29 స్థానాలను గెలిచుకుంది. అయితే ఏపార్టీ కూడ మెజారీటీ సాధించకపోవడంతో సందిగ్థత నెలకొంది. దీంతో అప్పటి రాష్ట్ర గవర్నర్ భూటాసింగ్ ఆయా పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పటు చేసేందుకు ఏడు రోజులపాటు అవకాశం ఇచ్చారు. అయితే ఏ పార్టీ కూడ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలను సిఫారసు చేస్తూ కేంద్రానికి సిఫారసు చేశారు.

అప్పటి యూపీఏ ఏం నిర్ణయం తీసుకుంది. అనంతరం పరిణామాలు

అప్పటి యూపీఏ ఏం నిర్ణయం తీసుకుంది. అనంతరం పరిణామాలు

ఇక బీహార్ సందిగ్ధంపై అప్పటికే పలుసార్లు చర్చించిన కేంద్ర ప్రభుత్వం గవర్నర్ భూటాసింగ్ పంపిన సిఫారసుపై 22న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అర్ధరాత్రి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధిస్తున్నట్టుగా ప్రకటించింది. అందుకు సంబంధించిన లేఖను రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు పంపింది. దీంతో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సిఫారసు లేఖ వచ్చిన రెండు గంటల్లోనే రాష్ట్రపతి పాలనకు అమోదముద్ర వేశారు. అయితే మధ్యలో ఎన్డీఏ కూటమి తమకు 115 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. అయితే ఎన్డీఏ కూటమి రాంవిలాస్ పాశ్వాన్ పార్టీకి సాధించిన ఎల్‌జేపీ 29 స్థానాలను సాధించడంతో వారిని కొనేందుకు ఏన్డీఏ కూటమీ ప్రయత్నాలు చేస్తుందని గవర్నర్ కేంద్రానికి లేఖ రాయడంతో హుటాహుటిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా అనంతరం అదే సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమీ స్పష్టమైన మెజారీటీ సాధించడంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

తాజాగా మహారాష్ట్రలో ఇవే పరిస్థితులు

తాజాగా మహారాష్ట్రలో ఇవే పరిస్థితులు

అయితే బీహార్ తరహాలో మహరాష్ట్రలో కూడ అవే పరిస్థితులు నెలకొన్నాయి. 19 రోజుల పాటు గవర్నర్ పలు పార్టీలకు అవకాశం ఇచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతో హుటాహాటిన గవర్నర్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. దీంతో విదేశీ పర్యటనకు వెళ్లే ముందే ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రపతి పాలన నిర్ణయాన్ని తీసుకుని వెంటనే అమలు చేశారు. ఇక బీజేపీ సైతం అదే తరహాలో ఎన్నికలు నిర్వహించి లబ్దిపోందాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా 2020లో ఎన్నికలు నిర్వహించి పూర్తి స్థాయి మెజారీటీ సాధించాలని భావిస్తోంది. అయితే కేంద్రం భావిస్తున్నట్టుగా పరిణామాలు గతంలో వలే ఉంటాయా లేక శివసేన బీజేపీ దారికి వస్తుందా అనేది వేచి చూడాలి.

గవర్నర్ తీరును తప్పు బట్టిన సుప్రిం కోర్టు

గవర్నర్ తీరును తప్పు బట్టిన సుప్రిం కోర్టు


అయితే అసెంబ్లీ రద్దుపై కేసును విచారించిన సుప్రిం కోర్టు బీహార్ అసెంబ్లీని రద్దు పరచడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అది రాజ్యంగా విరుద్దంగా జరిగిందని అభిప్రాయపడింది. అసెంబ్లీని పునరుద్దరించాలని భావించింది. కేవలం గవర్నర్ ఇచ్చిన వివేదిక ఆధారంగా కేంద్ర క్యాబినెట్ రద్దు నిర్ణయాలు తీసుకోకుదని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పరీశీలించిన తర్వాతే నిర్ణాయాలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్రాన్ని గవర్నర్ తప్పుపట్టించారని చెప్పింది. అయితే కోత్తప్రభుత్వం పూర్తి మెజారీటితో ఏర్పాటైన తర్వాత 2006లో తీర్పు వెలవరించడంతో ఎలాంటీ ఆదేశాలు గాని ఉత్తర్వులు గాని వెలువరింలేదు.

English summary
imposition of President's Rule in Maharashtra a similar move in Bihar in 2005. That time, the decision had been taken by the Congress-led UPA government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X