వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్గిల్ యుద్ద వీరులు చరితార్థులు..!వారందరికీ రుణపడి ఉంటామన్న రాష్ట్రపతి..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kargil Vijay Diwas 2019:సైనికుల త్యాగాలను స్మరించుకుంటున్న భారతం|20th Anniversary Of Operation Vijay

ఢిల్లీ/హైదరాబాద్ : దేశమంతా కార్గిల్ విజయ సంబరాల జ్ఞపకాల్లో మునిగితేలుతోంది. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బాలను నెమరువేసుకుంటోంది. ఆపరేషన్‌ విజయ్‌కి గుర్తుగా ఏటా జులై 26న కార్గిల్‌ దివస్‌ను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌ వేదికగా.. ఆనాటి అమరవీరులకు నివాళులర్పించారు. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు. 'కార్గిల్‌ దివస్‌.. కార్గిల్‌ యుద్ధంలో భారత సేనలు ప్రదర్శించిన అసమాన వీరత్వాన్ని గుర్తుచేసుకోవాల్సిన రోజు. ఈ సందర్భంగా.. దేశ రక్షణ కోసం తమ శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించిన వీరులందరికీ వందనాలు సమర్పిస్తున్నాం. ఆ అమరులందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం' అని కోవింద్‌ ట్విటర్‌ వేదికగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

President to recollect Kargil war heroes.!

కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆనాటి తన అనుభవాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. '1999లో కార్గిల్‌ యుద్ధం సందర్భంగా భారత సేనలను కలిసి వారికి సంఘీభావం తెలిపే అవకాశం లభించింది. అప్పట్లో నేను జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాను. సైనికులను కలిసి వారితో ముచ్చటించడం ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం' అని ప్రధాని ట్వీట్‌ చేశారు. అలాగే 'మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన ఆనాటి వీరులందరికీ నా వినయపూర్వక శ్రద్ధాంజలి' అంటూ నివాళులర్పించారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమరులను నివాళులర్పించారు. అలాగే సైనిక ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు సైతం స్మారకం వద్దకు చేరుకొని వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

English summary
The country is engulfed in memories of Kargil's success. Today, 20 years have passed since Kargil won the war. Kargil Diwas is celebrated on July 26 annually to commemorate Operation Vijay. President Ramnath Kovind took to Twitter to pay tribute to the martyrs of the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X