వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి.. యాభై ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన మీరా

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమిలోను 1967 ఓటమి రికార్డును బ్రేక్ చేశారు. మీరా కుమార్ 3.67 లక్షల ఓట్లు దక్కించుకున్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమిలోను 1967 ఓటమి రికార్డును బ్రేక్ చేశారు. మీరా కుమార్ 3.67 లక్షల ఓట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే.

భారత కొత్త రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్, ఏపీలో ఒక్క ఓటు కూడా దక్కించుకోని మీరా కుమార్భారత కొత్త రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్, ఏపీలో ఒక్క ఓటు కూడా దక్కించుకోని మీరా కుమార్

1967లో కాకా సుబ్బారావు తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో జాకీర్‌ హుస్సేన్‌ గెలుపొందారు. అప్పుడు జాకీర్‌కు 4.7లక్షల ఓట్లు రాగా, సుబ్బారావు 3.63లక్షల ఓట్లు వచ్చాయి.

Presidential elections: In defeat, Meira Kumar broke a 1967 record

అప్పటి నుంచి ఓడిపోయిన అభ్యర్థికి ఎవరికీ అన్ని ఓట్లు రాలేదు. అయితే సరిగ్గా యాభై ఏళ్ల తర్వాత మీరా కుమార్‌ ఆ రికార్డును బద్దలుకొట్టి 3.67లక్షల ఓట్లు సాధించారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వారిలో మీరా కుమార్ అత్యధిక ఓట్లు సాధించారు.

అయితే ఓటు షేరు మాత్రం సుబ్బారావు కంటే తక్కువగా వచ్చింది. 1967 ఎన్నికల్లో సుబ్బారావుకు 43 శాతం ఓటు షేరు రాగా, మీరా కుమార్‌కు కేవలం 34 శాతమే వచ్చాయి.

హర్యానా, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో విపక్షాలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి కోవింద్‌ను గెలిపించారు. సమాజ్‌వాదీ పార్టీలోనూ ములాయం వర్గం కోవింద్‌కే ఓటేసింది. ఇక ఢిల్లీ, పంజాబ్‌లలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యులు కొందరు ఎన్డీయేకు మద్దతివ్వడంతో కోవింద్‌ భారీ ఆధిక్యంతో గెలుపొందారు.

English summary
Meira Kumar who lost the Presidential election to Ram Nath Kovind bagged 3.67 lakh out of the 10.69 valid votes polled. Although she lost, she has something to cheer about as she became the losing candidate with the highest votes polled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X