వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్య నిర్ణయం: రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించిన శివసేన

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు శివసేన ఎట్టకేలకు మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం స్వయంగా ప్రకటించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబయి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు శివసేన ఎట్టకేలకు మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం స్వయంగా ప్రకటించారు.

పార్టీలో చర్చించిన తర్వాతే మద్దతు తెలుపుతున్నట్లు ఉద్ధవ్‌ వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థుల విషయమై శివసేన గతంలో ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

uddav-thackery

పేరుకు మిత్రపక్షాలైనా మహారాష్ట్రలో బీజేపీ-శివసేన బంధం ఉప్పు-నిప్పులా కొనసాగుతోంది. ఇటీవల రుణమాఫీ విషయమై బాహాటంగానే బీజేపీ సర్కారుపై సేన నిప్పులు కురిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో శివసేన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శివసేన పార్టీ 51వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సబర్బన్‌ మతుంగాలో నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఉద్దవ్‌ ఠాక్రే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.

తమకు దళిత ఓట్లే లక్ష్యమని, అయినా సరే తాము రామ్‌నాథ్‌కు మద్దతివ్వబోమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రూట్ మార్చుకున్నారు. శివసేన రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.

English summary
The Shiv Sena on Tuesday decided to support Bharatiya Janata Party’s (BJP) presidential election nominee Ram Nath Kovind. Sena president Uddhav Thackeray told reporters that party leaders had decided to support Kovind since they thought “he was a good person and would do well for the country”. With Shiv Sena’s support, the BJP-led National Democratic Alliance (NDA) has rallied behind Kovind. On Monday, Thackeray had accused the BJP of indulging in “vote bank politics” by proposing a Dalit for the president’s office. He had also said that the Sena would not support the BJP nominee if he was picked only because he was a Dalit. Asked about his earlier charge of caste politics, Thackeray said this question should be asked of Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X