వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాంఖడ్ లో బల నిరూపణ కాదు.. రాష్ట్రపతి పాలనే.. : సుప్రీం

By Mittapalli
|
Google Oneindia TeluguNews

ఉత్తరాంఖడ్ హైకోర్డు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. శాసనసభలో ఈ నెల 29న బల నిరూపణ లేదని స్పష్టం చేసిన సుప్రీం ఉత్తరాంఖడ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగించాల్సిందేనని ఆదేశాలు జారీ చేపింది. ఉత్తరాంఖడ్ హైకోర్డు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీం మెట్లెక్కడంతో ఈ తీర్పును వెలువరించింది కోర్టు.

అంతకుముందు ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్సందించిన సుప్రీం హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 29న అసెంబ్లీలో హరీష్ రావత్ బలనిరూపణ చేసుకోవాల్సి ఉండగా.. సుప్రీం తాజా తీర్పుతో ఇక బలపరీక్షకి తెర పడ్డట్టే. జస్టిస్ దీపక్ మిశ్రా, శివకీర్తి సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.

supreme court

అలాగే కేసుకి సంబంధించి తదుపరి విచారణ మే 3వ తేదీన ఉంటుందని ప్రకటించింది సుప్రీం. వాదనలు వినిపించే క్రమంలో.. కేసుతో రాష్ట్ర సీఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన సుప్రీం.. కొంతమంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసినంత మాత్రానా రాష్ట్రపతి పాలన విధిస్తారా..! అంటూ కేంద్రాన్ని నిలదీసింది.

English summary
The bench comprising Justices Dipak Misra and Shiva Kirti Singh posted the matter for further hearing on May 3 amidst indication that the verdict may be pronounced before the court breaks for summer vacation by the middle of next month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X