• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధర పెరిగింది.. ఇంధనం మండింది..! సామాన్యుడి జేబుకు చిల్లు పడింది..!!

|

హైదరాబాద్‌: పెట్రో భారం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ముడిసి చమురు బ్యెరెల్ ధరను కుదించడంతో ఆ భారం ఇంధన సంస్దల పై భారీ ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇంధర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.దీని ప్రభావం భారత దేశంలో పేద మద్యతరగతి ప్రజానికం తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువులతో సతమతమవుతున్న సామాన్యుడు తాజాగా పెరిగిన ఇందన ధరలతో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. వెంచిన ధరలను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే నియంత్రించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

 పెట్రోలు, డీజిలుపై 1 చొప్పున ఎక్సైజ్‌ సుంకం పెంపు..! రూపాయి చొప్పున పెరిగిన రోడ్డు సెస్సు..!!

పెట్రోలు, డీజిలుపై 1 చొప్పున ఎక్సైజ్‌ సుంకం పెంపు..! రూపాయి చొప్పున పెరిగిన రోడ్డు సెస్సు..!!

ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారమయ్యాయి. ప్రస్తుత బడ్జెట్‌లో పెట్రోలు, డీజిలుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు 1 రూపాయి చొప్పున పెంచారు. వాటిపై రోడ్డు-మౌలిక వసతుల సెస్సునూ లీటరుకు 1 రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు 28 వేల రూపాయల కోట్లకు పైగా నిధులు సమకూరనున్నాయి. మూల ధరకు ఎక్సైజ్‌ సుంకం కలిపిన తర్వాత స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్‌ను విధిస్తారు. వాటి పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకుంటే పెట్రోలు ధర లీటరుకు 2.5రూపాయలకు పైగా, డీజిలు ధర లీటరుకు 2.3 రూపాయలకు పైగా పెరుగుతుంది.

 తెలంగాణలో వాహనదారులకు ఏటా వెయ్యి కోట్ల భారం..! పరోక్షంగా మరో 400 కోట్ల బాదుడు..!!

తెలంగాణలో వాహనదారులకు ఏటా వెయ్యి కోట్ల భారం..! పరోక్షంగా మరో 400 కోట్ల బాదుడు..!!

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలుపై 2.60 రూపాయలు, డీజిలుపై 2.56 రూపాయల మేర పెరిగింది. దీనివల్ల తెలంగాణలోని వాహనదారులపై ప్రత్యక్షంగా ఏడాదికి 1,095 కోట్ల రూపాయలు, పరోక్షంగా మరో 400 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో 1.09 కోట్ల వరకు వాహనాలు ఉన్నాయి. అన్ని చమురు సంస్థలు కలిపి రాష్ట్రంలో సగటున రోజుకు 1.90 కోట్ల లీటర్ల పెట్రోలు, డీజిలును విక్రయిస్తున్నాయి. ఇందులో డీజిలు 1.30 కోట్ల లీటర్లు కాగా, పెట్రోలు 60 లక్షల లీటర్లు విక్రయం అవుతోంది. ఈ పెంపుదలతో ఏడాదికి లెక్కేస్తే వాహనదారులపై అధికభారం పడనుంది.

 కనిపించని భారం..! చల్లగా దోచుకుంటున్న వైనం..!!

కనిపించని భారం..! చల్లగా దోచుకుంటున్న వైనం..!!

కేంద్ర సెస్సుతో పరోక్షంగా కూడా సామాన్యుల నడ్డి విరగనుంది. ప్రయాణ ఛార్జీల నుంచి నిత్యావసర వస్తువులపైనా ఇది ప్రభావాన్ని చూపనుంది. కూరగాయలు, ఇతర నిత్యావసరాలపై సుమారు 400 కోట్ల రూపాయల వరకు ప్రభావం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీపై సెస్సు గణనీయ ప్రభావం చూపనుంది. ఆర్టీసీ రోజువారీగా ఆరున్నర లక్షల లీటర్ల డీజిలు వినియోగిస్తోంది. 2 రూపాయల పెంపుదలతో ఏడాదికి 45 కోట్ల రూపాయల వరకు భారం పడనుంది. ఇదేకాకుండా రోజువారీగా పెట్రోలు డీజిలు ధరల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. డీజిల్‌ భారం తడిసి మోపెడు అవుతుందని అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

  భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు
   ముడి చమురుపై దిగుమతి సుంకం..! కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న జనం..!!

  ముడి చమురుపై దిగుమతి సుంకం..! కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న జనం..!!

  ముడి చమురుపై టన్నుకు రూపాయి చొప్పున కస్టమ్స్‌ లేదా దిగుమతి సుంకాన్ని విధించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. మనదేశం ఏటా సగటున 22 కోట్ల టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ లెక్కన ఖజానాకు 22 కోట్ల రూపాయలు అదనంగా అందనున్నాయి. ప్రస్తుతం ముడి చమురుపై కస్టమ్స్‌ సుంకమేదీ లేదు. దీనిపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Fuel prices are becoming more and more burdensome for the common man. The special excise duty on petrol and diesel has been raised by Rs 1 per liter in the current budget. It has been announced that the road and infrastructure cess on them will be increased by Rs 1 per liter. As a result, the government exchequer is expected to raise more than Rs 28,000 crore.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more