వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగరెట్లు, సెల్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం

సిగరెట్టు ప్రియులకు బడ్జెట్ చేదు వార్తే. సిగరెట్టు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సిగరెట్టు పై పన్నులను పెంచడంతో ఈ ధరలు పెరిగే అవకాశం ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గ్రామీణ రంగానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు.అయితే కేంద్రం తీసుకొన్న నిర్ణయాల కారణంగా సిగరెట్లు, సెల్ ఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.కార్ల ధరలు పెరగనున్నాయి

గ్రామీణ యువతను, ఎస్ సి ఎస్ టి మహిళలు వెనుకబడిన వర్గాలకు కేంద్రం బడ్జెట్ లో వరాలు కురిపించింది. అయితే సిగరెట్టు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

సిగరెట్లు, సెల్ ఫోన్లపై ధరలు పెరగనున్నాయి. సెల్ ఫోన్లపై కూడ కస్టమ్స్ లెవీ కారణంగా ఒక్కశాతం ధరలు పెరగనున్నాయి.

సెల్ ఫోన్ విడిభాగాలపై విధించిన పన్ను కారణంగా ఈ ధరలు పెరిగే అవకాశం ఉంది.వెయ్యి సిగరెట్లపై ప్రస్తుతంం రూ.215 పన్ను ఉంది. దాన్ని రూ.311 పెరగనుంది.పాన్ మసాలాలపై దిగుమతి సుంకాన్ని 6 నుండి 9 శాతానికి పెంచారు.దీంతో పాన్ మసాలాల ధరలు కూడ పెరగనున్నాయి.

prices of mobile phones cigarette are set to go up

దిగుమతి చేసుకొన్న అల్యూమినియంపై 30 శాతం పన్నును విధించనున్నారు. సెల్ ఫోన్లలో వాడే సర్క్యూట్ బోర్డులపై 2 శాతం పన్నును విధించారు.సెల్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఎల్ ఈ డీ లైట్ల ధరలు, ఉపకరణాలపై కూడ 5 శాతం పన్ను వేశారు. దీంతో ఎల్ ఈ డీ లైట్ల ధరలు కూడ పెరిగే అవకాశం ఉంది.
మరో వైపు వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్దిని సాధించే అవకాశం ఉందని అంచనాతో ఎఫ్ఎంసిజీ రంగం బాగా పుంజుకోనుంది.

గ్రామీణాభివృద్ది పేదలకు కనీస ఆదాయ కల్పన, నీటిపారుదల సౌకర్యాలకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడ ఇందుకు తోడ్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జిఎస్ టి అమల్లోకి రానున్నందున ఎక్సైజ్ ,సర్వీస్ ట్యాక్స్ ప్రస్తుత విధానంలో పెద్దగా మార్పులు చేయలేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.సిల్వర్ కాయిన్స్ పై 12.5 శాతం దిగుమతి సుంకం విధించారు. ఎక్సైజ్ , సర్వీస్ ట్యాక్స్ లలో స్వల్ప మార్పుల కారణంగా కొన్ని వస్తువుల ధరలు పెరుగుదలలో మార్పులు చోటుచేసుకోనే అవకాశాలున్నాయి.

ధరలు పెరిగేవి

వాటర్ ఫిల్టర్స్ పరికరాలు, పార్శిల్ ద్వారా దిగుమతి అయ్యే ఇతర వస్తువులు, పొగాకు, బిడీలు, పాన్ మసాలాలు, వెండి నాణేలు.పాలిమర్ టేపులు, వెండి నాణేలు, పతకాలు, మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు

ధరలు తగ్గేవి

ఎల్ ఈ డీ దీపాలు, సౌరఫకాలు, మైక్రో ఎటిఎంలు, ఫింగర్ ప్రింట్ యంత్రాలు,ఐరిస్ స్కానర్లు ధరలు తగ్గనున్నాయి.ఆన్ లైన్ టిక్కెట్టు బుకింగ్, సహజ వాయువులు, ఇళ్ళలో ఉపయోగించే ఆర్ వో ప్లాంట్ల భాగాలు, సౌర విద్యుత్ కోసం ఉపయోగించే టెంపర్డ్ గ్లాసులు, ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పరికరాలు,పవన విద్యుత్ జనరేటర్లు, తోలు ఉత్సత్తుల్లో ఉపయోగించే చర్మశుద్ది పదార్థాలు, పివోఎస్ మెషీన్స్ కార్డులు, ఫింగర్ ప్రింట్ రీడర్లు

English summary
prices of mobile phones cigarette are set to go up
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X