వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌మ్ము కాశ్మీర్‌కు మోదీ భారీ ప్యాకేజ్‌..! అఖిలప‌క్ష స‌మావేశం ఏర్పాటు: కాశ్మీర్ భ‌విష్య‌త్‌పైన భ‌రోసా

|
Google Oneindia TeluguNews

జ‌మ్ము కాశ్మీర్లో అర్టిక‌ర్ 370 ర‌ద్దు..ఆ రాష్ట్రం రెండుగా విభ‌జిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న దిశ‌గా అడుగులు వేస్తోంది. జ‌మ్ము కాశ్మీర్ విష‌యంలో రాజ్య‌స‌భ‌లో హోం మంత్రి ప్ర‌క‌ట‌న త‌రు వాత దేశ వ్యాప్తంగా వ‌స్తున్న అభిప్రాయాలు..కాశ్మీర్‌లో ప‌రిస్థితిని ప్ర‌ధాని మోదీ స‌మీక్షిస్తున్నారు. కాశ్మీర్‌లో ఎక్క‌డా శాంతి భ‌ద్ర‌త‌ల కు విఘాతం లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అదే స‌మ‌యంలో ఈ నిర్ణ‌యానికి గ‌ల కార‌ణాల‌ను..త‌మ భ‌వి ష్య‌త్ ఆలోచ‌న‌ల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌టానికి ప్ర‌దాని ఈనెల 7న జాతినుద్దేశించి ప్ర‌సంగించ నున్నారు. అదే విధంగా అఖిల‌ప‌క్ష స‌మావేశంలోనూ వివరించ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ జ‌మ్ము కాశ్మీర్ అభివృద్ది కోసం ప్ర‌త్యేకంగా భారీ ప్యాకేజీ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

జ‌మ్ము కాశ్మీర్‌కు కేంద్రం భారీ ప్యాకేజీ..
జ‌మ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ర‌ద్దుతో పాటుగా జ‌మ్ము-కాశ్మీర్‌ను అసెంబ్లీలో కూడిన కేంద్ర పాలిన ప్రాంతం అదే విధం గా ల‌డ‌ఖ్‌ను కేంద్ర పాలిన ప్రాంతంగా మారుస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌మ్ము కాశ్మీర్‌కు ఉన్న భౌగోళిక‌..రాజ‌కీయ ప‌రిస్థితుల ను ఒక్క నిర్ణ‌యంతో మార్చేసిన కేంద్రం మ‌రో నిర్ణ‌యం తీసుకోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్టిక‌ల్ 370, 35ఏ కార‌ణంగా ఏ ఒక్క‌రూ ఇత‌ర ప్రాంతాల నుండి వ‌చ్చి పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు ద్వారా కొత్త‌గా పెట్టుబ‌డుల‌కు జ‌మ్ము కాశ్మీర్‌లో అవ‌కాశం క‌ల్పించే విధంగా నూత‌న పాల‌సీని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క టించ‌నుంది. ఇందులో భాగంగా జ‌మ్ము కాశ్మీర్ అభివృద్ది కోసం కేంద్ర ప్ర‌భుత్వం భారీ ప్యాకేజి ప్ర‌క‌ట‌న దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించి ఈనెల 7న జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది. దీని ద్వారా ఆ రాష్ట్ర అభివృద్ది కోస‌మే తాము నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని చెప్ప‌టంతో పాటుగా అక్క‌డ అభివృద్దికి తీసుకొనే చ‌ర్య‌లను వివ‌రించ‌నున్నారు.

Prime Minister Modi planning to announce special package for Jammu Kashmir development shortly..

7న ప్ర‌ధాని కీల‌క నిర్ణ‌యాలు..
కాశ్మీర్ అంశం మీద పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో చ‌ర్చ పూర్తి చేసిన త‌రువాత దీని పైన ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యించారు. దీని కోసం కాశ్మీర్ పైన ఈ నిర్ణ‌యాల నేప‌థ్యంతో పాటుగా ..ప్ర‌స్తుత అక్క‌డ ప‌రిస్థితుల పైన అఖిల ప‌క్ష నేత‌ల‌కు ప్ర‌ధాని వివ‌రించ‌నున్నారు. దీని కోసం ఈనెల 7న అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ప్ర‌ధాని డిసైడ్ అయ్యారు. గ‌తంలో ప్ర‌ధాని కీల‌క సంద‌ర్భాల్లో మాత్ర‌మే జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యం లో..అదే విధంగా ఇస్రో ప్ర‌యోగాల‌ను అభినందిస్తూ ప్ర‌సంగాలు చేసారు. తిరిగి ఇప్పుడు జ‌మ్ము కాశ్మీర్ నిర్ణ‌యాల‌ను అత్యంత గోప్యంగా ఉంచుతూ..వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తూ..రాజ్య‌స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ పెట్ట‌టం..రాష్ట్రప‌తి ఆమోద ముద్ర వేయ‌టం అంతా చ‌కాచ‌కా పూర్త‌య్యాయి. దీంతో..తాము తీసుకున్న నిర్ణ‌యం గురించి అంద‌రి అనుమానాలు నివృత్తి చేసే విధంగా ప్ర‌ధాని అఖిల‌ప‌క్ష స‌మావేశంలో అన్ని పార్టీల‌కు వివ‌రించ‌టంతో పాటుగా త‌న ప్ర‌సంగం ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.

English summary
Prime Minister Modi decided to give message to public on latest decisions on Jammu Kashmir. On 7th PM called for all party meeting to explain Govt decisions back ground and future plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X