వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృతజ్ఞతలు: మోడీకి ఐర్లాండ్ ప్రధాని అపురూప కానుక

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

డబ్లిన్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన వారం రోజుల విదేశీ పర్యనటలో భాగంగా డబ్లిన్ చేరుకున్నారు. 60ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ భారత ప్రధానమంత్రి ఐర్లాండ్‌లో పర్యటించిన ఘనతను నరేంద్రమోడీ సొంతం చేసుకున్నారు. ప్రధాని మోడీకి డబ్లిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐర్లాండ్ పర్యటన చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్‌ ప్రధాని ఎండా కెన్నీతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐర్లాండ్‌ అపూర్వ స్వాగతానికి ప్రదాని నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఐర్లాండ్‌ వచ్చేందుకు 59 సంవత్సరాలు పట్టిందన్నారు.

భారత్‌, ఐర్లాండ్‌ మధ్య అనేక సారూప్యతలున్నాయన్నారు. ఐర్లాండ్‌ అభివృద్ధిలో 26 వేల మంది భారతీయుల కృషి ఉందని చెప్పారు. కాగా, భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామని ఐర్లాండ్‌ ప్రధాని ఎండా కెన్నీ ప్రకటించారు. అంతక ముందు ప్రధాని మోడీకి ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ వినూత్నమైన కానుకలు బహూకరించారు.

ఐరీష్ జాతీయ క్రీడైన హర్లింగ్ బ్యాట్, బంతితో పాటు ఐరీష్ క్రికెట్ టీమ్ జెర్సీని మోడీకి కెన్నీఅందజేశారు. ఇక, ప్రధాని మోడీ భారత ప్రాచీన గ్రంథాల నుంచి సేకరించిన రాతప్రతుల పునరుత్పత్తులను కెన్నీకి అందజేశారు.

డబ్లిన్‌లో ప్రధాని మోడీ: 60ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు

డబ్లిన్‌లో ప్రధాని మోడీ: 60ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు

బుధవారం సాయంత్రం డబ్లిన్ నుంచి న్యూయార్క్‌కు బయల్దేరే ముందు ఐర్లాండ్‌లోని భారత సంతతి ప్రజలతో ప్రధాని మోడీ కొద్దిసేపు సమావేశమవుతారు. న్యూయార్క్ లోని వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్‌లో బసచేస్తారు.

 డబ్లిన్‌లో ప్రధాని మోడీ: 60ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు

డబ్లిన్‌లో ప్రధాని మోడీ: 60ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు

ఐక్యరాజ్య సమితిలో అడాప్షన్ ఆఫ్ ది పోస్ట్ -2015 డెవలప్‌మెంట్ సదస్సు జరగనుంది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో సుస్ధిర అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు.

 డబ్లిన్‌లో ప్రధాని మోడీ: 60ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు

డబ్లిన్‌లో ప్రధాని మోడీ: 60ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు

దీంతో పాటు ఈనెల 28న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతిథ్యమిస్తున్న శాంతి పరిరక్షణపై ఐక్యరాజ్య సమితి సదస్సులో కూడా మోడీ పాల్గొంటారు. ఆ తర్వాత వారం రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రధాని మోడీ సిలికాన్ వ్యాలీని కూడా సందర్శిస్తారు.

 డబ్లిన్‌లో ప్రధాని మోడీ: 60ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు

డబ్లిన్‌లో ప్రధాని మోడీ: 60ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు

ఫేస్‌బుక్ చీఫ్ జూకర్‌బర్గ్‌తో పాటు అక్కడి 50 కంపెనీలకు పైగా సీఈఓలతో ప్రధాని భేటీ కానున్నారు. అనంతరం అమెరికాలోని భారతీయులు ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారు.

English summary
Prime Minister Narendra Modi upon his arrival at International Airport, Dublin in Ireland on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X