వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్‌లో పోటెత్తిన ప్రధాని మోడీ ఫాలోవర్స్... టాప్ ట్రెండింగ్‌లో మోడీ బర్త్‌డే హ్యాష్‌టాగ్స్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Narendra Modi Birthday Wishes Continue Pour In Twitter|ట్విట్టర్‌లో పోటెత్తిన ప్రధాని మోడీ ఫాలోవర్స్

ప్రధాని నరేంద్రమోడీ సోమవారం 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే పిల్లల నుండి పెద్దల వరకు అనేక మంది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మోడీ భర్త్‌డే హ్యాష్‌టాగ్స్ టాప్‌లో ఉన్నాయి. మొత్తం పది ట్రెండింగ్స్‌లో టాప్ 7 హ్యాష్‌ట్యాగ్స్ ఆయన భర్త్ డేకు సంబంధించినవే ట్రెండ్ అవుతున్నాయి.

మధ్యాహ్నం వరకే 11 లక్షలు దాటిన విషెస్

మధ్యాహ్నం వరకే 11 లక్షలు దాటిన విషెస్

69వ పుట్టినరోజు జరుపుకోంటున్న నేపథ్యంలోనే రాజకీయాలకు అతీతంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెళ్లువె త్తుతున్నాయి.మధ్యాహ్నం వరకే 11 లక్షల 37 వేల మంది ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరి బీచ్‌లో మోదీ భారీ బొమ్మ గీసి, తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరోవైపు చిన్నపిల్లలు సైతం మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ పాటలు పాడారు.

5 కోట్లు దాటిన మోడి ట్విట్టర్ ఫాలోవర్స్

5 కోట్లు దాటిన మోడి ట్విట్టర్ ఫాలోవర్స్

ఇక ఇప్పటికే సోషల్ మీడీయా ఫాలోవర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉన్న మోడీ తన ట్విట్టర్ ఖాతాలో 50 మిలియన్ల ఫాలోవర్స్‌ మార్క్‌ను దాటారు. అమేరికా ప్రస్థుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు 64 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉండగా , అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 108 మిలియన్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉన్నారు.

గుజరాత్ సీఎంగా ట్విట్టర్ ఖాతాను ఒపెన్ చేసిన మోడీ

గుజరాత్ సీఎంగా ట్విట్టర్ ఖాతాను ఒపెన్ చేసిన మోడీ

ఇక భారత రాజకీయ నాయకులు ఎవరు కూడ మోడీ సోషల్ మీడీయా ఫాలోవర్స్‌కు దగ్గరగా కూడ లేరు. ఇక మోడీ అధికారిక ట్విట్టర్ ఖాత కూడ 30 మిలియన్ల ఫాలోవర్స్‌ను కల్గి ఉంది.కాగా ట్విట్టర్ మెయింటెన్స్‌లో ఎప్పటికప్పుడు పలు విషయాలను మోడీ పోస్టు చేస్తారు. వివిధ వేదికలలో ఆయన చేసిన ప్రసంగాల నుండి, అతను వెళ్ళిన ప్రదేశాలు మరియు ఆయన కలిసిన వ్యక్తుల వివరాలను సైతం ప్రధాని తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఉంటారు.ప్రధాని మోడీ 2009 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్విట్టర్ ఖాతను ఉపయోగించడం ప్రారంభించాడు ఈనేపథ్యంలోనే 2014 లో ప్రధాని పదవిని చేపట్టడంతో ట్విట్టర్ ఫాలోవర్స్ అధికమయ్యారు.

English summary
Twitter is abuzz since last night as wishes continue pour in for Prime Minister Narendra Modi on his 69th birthday today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X