వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా మరో సర్ధార్ పటేల్ ... అభినందించిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోడితో పాటు హోంశాఖ మంత్రి అమిషా పై పలువురు ప్రశంశలు కురిపించారు. ఈనేపథ్యంలోనే అమిత్ షా మరో సర్దార్ పటేల్ అంటూ ఆయనపై ప్రశంశల వర్షం కురిపించాడు ఎంపీ గౌతమ్ గంబీర్ . ఈ సంధర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా ధైర్య సాహాసాల్ని ఆయన కోనియాడారు.

ఈ నేపథ్యంలోనే పలువురు క్రీడాకారులు అమిత్ షాతోపాటు ప్రధానమంత్రి మోడిని అభినందిచారు. ఇక క్రీడా కారులతో పాటు బాలివుడ్ నటులు మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు.ఇక పలువురు బాలివుడ్ నటులు సైతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఈనేపథ్యంలోనే అమిత్ షా సహాసాన్ని కోనియాడారు.

Prime Minister Narendra Modi congratulated home minister Amit Shah for his speech

మరోవైపు రాజ్యసభలో అమిత్ వ్యవహరించిన తీరుతోపాటు ఆర్టికల్ ఎందుకు రద్దు చేయావల్సి వచ్చిందో అనర్గళంగా వివరించిన అమిత్ షాను ప్రధాని మోడీ అభినందించారు.ఈ విపక్షాలకు బదులు చెప్పడంలో అమిత్ షా విజయం సాధించారని ట్విట్టర్‌లో పేర్కోన్నారు.ఆర్టికల్ 370 వల్ల గతంలో జరిగిన అన్యాయాలను చాల విపులంగా వివరించాడని పేర్కోన్నాడు. ఈనేపథ్యంలో ఆయన విస్తృత ప్రసంగం చేశాడని అన్నారు. ఇది జమ్ము కశ్మీర్ ప్రజల కోసం చేసిన కృషిగా ఆయన ట్వీట్ చేశారు.

కాగా అమిత్ ఉదయం 11 గంటలకు జమ్ము కశ్మీర్ పునర్వీభజన బిల్లును ప్రవేశ పెట్టిన అనంతరం విపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే, ఈనేపథ్యంలోనే రాజ్యసభలో బిల్లు పాస్ చేయించుకునేందుకు అమిత్ సమయానుకూలంగా వ్వవహరించారు. ఎలాంటీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రతిపక్షాలు అడిగిన సందేహాలకు ఆయన సమాధానం చెప్పారు. ఈనేపథ్యంలోనే సుమారు గంటపాటు రాజ్యసభలో మాట్లాడి ప్రతిపక్షాలను ఎదుర్కోన్నాడు. దీంతో ఆయనపై సభలో ఉన్న ప్రధాని మోడి ముందుగా అభినందించాడు.

English summary
Prime Minister Narendra Modi congratulated home minister Amit Shah for his speech in parliament today over the government's unprecedented move on Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X