వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్ధవ్ పై అభినందనల వెల్లువ: అటు నరేంద్ర మోడీ, ఇటు మమతా బెనర్జీ.. !

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ థాకరేకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు శుభాకాంక్షలను తెలిపారు. ఉద్ధవ్ థాకరే సారథ్యంలో మహారాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అకాంక్షించారు.

కంగ్రాచ్యులేషన్స్ టు ఉద్ధవ్ థాకరే జీ అంటూ

కంగ్రాచ్యులేషన్స్ టు ఉద్ధవ్ థాకరే జీ అంటూ ప్రధానమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు. ముంబైలోని శివాజీ పార్కులో ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్ది సేపటికే నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయ, సహకారాన్ని అందజేస్తామని చెప్పారు.

Prime Minister Narendra Modi Congratulates Maharashtra Chief Minister Uddhav Thackeray

బీజేపీని వ్యతిరేకించారు..

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య అనేక విషయాల్లో భావసారూప్యం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్ దేశ సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతుండగా, మహారాష్ట్ర దేశ ఆర్థిక రాజధానిగా కొనసాగుతోందని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల ప్రజలు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాయని అన్నారు. గురువారం నాడే పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడు సీట్లను గెలుచుకుందని చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు తాను శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday, November 28, congratulated Uddhav Thackeray for taking oath as chief minister of Maharashtra. "Congratulations to Uddhav Thackeray Ji on taking oath as the CM of Maharashtra. I am confident he will work diligently for the bright future of Maharashtra," the prime minister said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X