వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిష్కేక్ సమావేశానికి మోడీ... పాక్ గగనతలం గుండా ప్రయాణించని ప్రధాని...!

|
Google Oneindia TeluguNews

కిర్గిజ్‌స్థాన్ జరగనున్న ఎస్‌సీవో సమావేశాలకు హజరయ్యోందుకు ప్రధాన మంత్రి మోడీ బిష్కేక్ వెళ్లారు. అయితే కిర్గిస్థాన్‌కు చేరుకునేందుకు మోడీ పాక్ గగనతలం మీద నుండి అనుమతిని ఇచ్చినా.. పాక్ నుండి కాకుండా ఒమన్ ,ఇరాన్ దేశం మీదుగా ప్రధాని వెళ్లారు.కాగా బిష్కేక్‌లో రెండు రోజుల పాటు జరగనున్న సమావేశంలో మోడీ పాల్గోనున్నారు.

ఇదంతా బీజేపీ కుట్ర.. సమ్మె చేస్తున్న జూడాలకు దీదీ అల్టిమేటం.. ఇదంతా బీజేపీ కుట్ర.. సమ్మె చేస్తున్న జూడాలకు దీదీ అల్టిమేటం..

రష్యా, చైనాలతో ద్వైపాక్షిక చర్చలు...

రష్యా, చైనాలతో ద్వైపాక్షిక చర్చలు...

13,14 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే సమావేశంలో రష్యా, ,చైనా, దేశాలతో ప్రధాని నరేంద్రమోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం అతిధ్య దేశమైన కిర్గిస్థాన్‌తో కూడ మోడీ ద్వైపాక్షి చర్చలు జరుపుతారు..ఇక మరోవైపు ఎసీవో సమావేశంలో దాయాదీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడ సమావేశాలకు హజరుకానున్నారు.అయితే పాకిస్థాన్‌తో కూడ ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలపై చర్చలు జరుగుతాయి అని ప్రచారం జరిగినప్పటికి..పాకిస్థాన్‌తో ఎలాంటీ చర్చలు కొనసాగించడం లేదని భారద విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు.

పుల్వామా దాడి తర్వాత ఓకే వేదిక పైకి భారత, పాక్ ప్రధానులు

పుల్వామా దాడి తర్వాత ఓకే వేదిక పైకి భారత, పాక్ ప్రధానులు

ఇక రెండు దేశాల మధ్య పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల ప్రధాన మంత్రులు కూడ ఒకే వేదికపై కలుసుకోనున్నారు. అయితే మోడీ రెండవ సారి ప్రధాన మంత్రి అయిన తర్వాత పాకిస్థాన్ ప్రధానితో కశ్మీర్‌ వివాదానికి సంబంధించి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారనే వార్తలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడ సానుకూలంగా స్పందించారు. కశ్మీర్ సమస్య పరిష్కారం లభించాలంటే మోడీ ప్రధాని మరోసారి ప్రధాన మంత్రి కావాల్సిన అవసరం ఉందని స్వయంగా ఇమ్రాన్ కాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

 పాక్ గగనతలం నుండి వెళ్లేందుకు ఇష్టపడని మోడీ...

పాక్ గగనతలం నుండి వెళ్లేందుకు ఇష్టపడని మోడీ...


పాకిస్థాన్‌తో చర్చలను పక్కన పెడితే.. అసలు పాకిస్థాన్ గగనతలం నుండి కూడ ప్రయానించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టపడలేదు. అంతకు ముందు... మోదీ విమానానికి గగనతల అనుమతులు ఇవ్వాలన్న భారత్‌ విజ్ఞప్తికి పాకిస్తాన్‌ రెండు రోజుల క్రితం సానుకూలంగానే స్పందించింది. తమ దేశం మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్‌ వెళ్లేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంగీకరించినట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వవర్గాలు తెలిపాయి.కాని మోడీ వెళ్లనున్న ప్రత్యేక విమానం మాత్రం పాకిస్థాన్ మార్గం గుండా వెళ్లడం లేదని విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు.మరోవైపు బిష్కేక్ వెళ్లేందుకు గాను రెండు మార్గాలను సిద్దం చేసినట్టు వారు తెలిపారు. అందులో ఓమన్, ఇరాన్, దేశాల గుండా మోడీ వెళ్లారు.

English summary
prime Minister Narendra Modi embarked on a two-day visit to Bishkek in Kyrgyzstan on Thursday for the SCO summit.India will hold bilateral meetings with Russia and China on the sidelines of the Shanghai Cooperation Organisation(SCO) summit at Bishkek
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X