వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే చూడండి: నరేంద్ర మోడీ చేసిన అతి గొప్ప అడ్వెంచరస్ చిత్రం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మరి కొన్ని గంటలు! డిస్కవరీ ఛానల్ లో రెగ్యులర్ గా ప్రసారం అయ్యే ఎపిసోడ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. బ్రిటన్ కు చెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఈ ఎపిసోడ్ లో కనిపించిన ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కానుంది. రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్ లో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. మొత్తం 180 దేశాల్లో ఒకేసారి ఈ ఎపిసోడ్ ప్రసారమౌతుందని డిస్కవరీ ఛానల్ యాజమాన్యం వెల్లడించింది. దీనికి సంబంధించి ఇదివరకే రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ ఎపిసోడ్ మొత్తాన్నీ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించారు. దీని కోసం బేర్ గ్రిల్స్ మనదేశానికి వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కొనసాగింది. బేర్ గ్రిల్స్ తో కలిసి నరేంద్ర మోడీ చేసిన సాహసాలను మనం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు.

<strong>వైఎస్ జగన్ పాదయాత్రపై జయహో పుస్తకం: ఆ మంత్రం..ప్రతిక్షణం ఉత్తేజితుడిని చేసిందన్న సీఎం</strong>వైఎస్ జగన్ పాదయాత్రపై జయహో పుస్తకం: ఆ మంత్రం..ప్రతిక్షణం ఉత్తేజితుడిని చేసిందన్న సీఎం

ఈ ఎపిసోడ్ ప్రసారం తేదీ ఖరారైన నేపథ్యంలో.. బేర్ గ్రిల్స్ తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీపై చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ లోని కొన్ని కీలక ఘట్టాలను తీసుకుని కట్ చేసిన ప్రోమో అది. ఈ ఎపిసోడ్ మొత్తం 180 దేశాల్లో ప్రసారం కానుంది. ఆయా దేశాల ప్రజలు సరికొత్త మోడీని చూస్తారని అంటూ బేర్ గ్రిల్స్ వ్యాఖ్యానించారు. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ఈ సాహసానికి పూనుకున్నారని ప్రశంసించారు. ఈ ఎపిసోడ్ ప్రసారమైన తరువాత ప్రజలకు అడ్వెంచర్ ట్రిప్ లపై మరింత ఆసక్తి కలుగుతుందని, వన్యజీవులను సంరక్షించాలనే బాధ్యత గుర్తుకు వస్తుందని అన్నారు. తన యుక్త వయస్సులో హిమాలయాల్లో తిరుగాడిన అనుభవం ఉన్న నరేంద్ర మోడీ..అత్యంత క్లిష్టమైన మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ లోనూ చురుకుగా కనిపించారు.

Prime Minister Narendra Modi in Man vs Wild episode with Bear Grylls to air today at 9 pm

ఏకకాలంలో 180 దేశాల్లో ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ ద్వారా భారత్ అంటే ఏమిటో వివరించదలిచారు నరేంద్ర మోడీ. తన ఉద్దేశం ఏమిటో ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. పర్యావరణ సంరక్షణను, జంతువధను నిషేధించాల్సిన అవసరాన్ని ఆయన ఈ ఎపిసోడ్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రకృతికి ఎదురెళ్తే వినాశనం తప్పదని హెచ్చరించారు. ప్రకృతిని విధ్వంసం చేయాలని మనిషి నిర్ణయం తీసుకుంటే.. అతనికి అన్నీ ప్రమాదకరంగానే కనిపిస్తాయని అన్నారు. మనిషి సైతం అత్యంత ప్రమాదకారి అని చెప్పారు. ప్రకృతిని పరిరక్షించడానికి మనం ప్రయత్నిస్తే.. అదే మనల్ని కాపాడుతుందని, పురోగమనానికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రకృతిని ప్రేమించడం తన అభిమతమని, తనకు 17-18 సంవత్సరాల వయస్సులోనే ఇంటిని వదిలేశానని, హిమాలయాల్లో గడిపానని చెప్పుకొచ్చారు.

English summary
Prime Minister Narendra Modi would be seen in a never-before-seen avatar of an adventurer on Monday. PM Modi is all set to make his debut on Discovery Channel’s popular television show ‘Man vs Wild’, which is hosted by ace adventurer and survival instructor ‘Bear’ Grylls, whose real name is Edward Michael Grylls. Man vs Wild is a survival television series hosted by ace adventurer Bear Grylls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X