వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్ చేరుకున్న ప్రధాని - ప్రవాస భారతీయుల ఘన స్వాగతం : యూఎన్జీఏ లో ప్రసంగం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో నేడు ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఐరాస సాధారణ సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు. తాను న్యూయార్క్ చేరుకున్న విషయాన్ని ప్రధాని ట్వీట్ చేసారు. 'న్యూయార్క్ సిటీకి చేరుకున్నాను. సెప్టెంబర్‌ 25న సాయంత్రం 6.30 గంటలకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నాను' అని ప్రధాని మోదీ ట్వీట్‌ లో పేర్కొన్నారు. కాగా, న్యూయార్క్‌ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.

న్యూయార్క్ చేరిన ప్రధాని

మోదీ ఉన్న హోటల్‌ బయట ప్రవాస భారతీయులు వందేమాతరం, భారత్‌ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీ అంతకుముందు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలు, ఆఫ్ఘనిస్థాన్‌ సహా తాజా అంతర్జాతీయ పరిస్థితలుపై చర్చించారు. అనంతరం క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ భేటీకి ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులు స్కాట్ మారిసన్​, యొషిహిదే సుగాలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ - ప్రధాని మోదీ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

బైడెన్ - మోదీ కీలక చర్చలు

బైడెన్ - మోదీ కీలక చర్చలు

భారత్‌-అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని.. నలభై లక్షల మంది భారతీయ అమెరికన్లు అమెరికాను నిత్యం బలోపేతం చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. భారత్‌-అమెరికా బంధం పలు అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడానికి తోడ్పడుతుందని తాను చాలాకాలంగా విశ్వసిస్తున్నట్టు ఆయన తెలిపారు. ''నిజానికి.. 2020నాటికి అమెరికా-భారత్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా ఉంటాయని నేను 2006లోనే చెప్పాను'' అని గుర్తుచేశారు.

భారత్ - అమెరికా సంబంధాల పైనే

రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాలైన భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు మరింత సన్నిహితం, దృఢతరం, బలోపేతం కాబోతున్నాయన్నారు. బైడెన్‌ ఈ ఏడాది జనవరిలో అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వీరిద్దరూ ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఆరంభంలో జరుగుతున్న ఈ భేటీ ఎంతో కీలకమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీనే చోదకశక్తిగా మారిందని.. ప్రపంచ సంక్షేమానికి అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకు మనందరం మన ప్రతిభను ఉపయోగించాలని మోదీ అభిప్రాయపడ్డారు.

క్వాడ్ సమావేశంలోనూ ప్రధాని కీలకంగా

క్వాడ్ సమావేశంలోనూ ప్రధాని కీలకంగా

ఈ దశబ్దాంలో భారత్‌-అమెరికా సంబంధాల్లో కీలకమైన అంశం వాణిజ్యమేనని గుర్తుచేసిన ప్రధాని.. ఆ దిశగా చేయాల్సిన కృషి చాలా ఉందన్నారు. క్వాడ్ సమావేశంలోనూ ప్రధాని కీలక అంశాలను ప్రస్తావించారు. కరోనా వైరస్ నిర్మూలన, వాతావరణ మార్పులపై క్వాడ్‌లో కీలక అంశంగా చర్చించారు. క్వాడ్ హోస్టింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.

Recommended Video

Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రధాని

ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రధాని

సమావేశానికి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగా హాజరయ్యారు.ఇక, ఐక్యరాజ్య సమితి వార్షిక సదస్సులో ప్రధాని ఏ అంశాలు ప్రస్తావిస్తారు.. ఉగ్రవాదం పైన ఈ వేదిక నుంచి ఎటువంటి హెచ్చరికలు చేస్తారనేది భారత్ తో పాటుగా ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో హాజరు తరువాత ప్రధాని అమెరికా పర్యటన ముగుస్తుంది. ఆదివారం ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

English summary
Prime Minister Narendra Modi reached New York where he is scheduled to address the 76th session of the United Nations General Assembly, which had gone virtual last year due to the COVID-19 pandemic
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X