వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: అన్నాడీఎంకేకి చుక్కలు చూపించిన ప్రధాని మోడీ, ఒక్కమాట చెప్పలేదు, భజన !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 50 శాతం స్కూటర్ ల రాయితీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. శనివారం రాత్రి చెన్నైలో ఏర్పాటు చేసిన జయలలిత 70 జయంతి వేడుకల ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ 7 మంది మహిళలకు రాయితీ స్కూటర్ లు అందించి లాంచనంగా ఆ పథకాన్ని ప్రారంభించారు.
అయితే తమిళనాడు ప్రభుత్వం గురించి, కావేరీ నీటి సమస్య గురించి ఏమాత్రం మాట్లాడని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి భజన చేసి అన్నాడీఎంకేకి చుక్కలు చూపించారు.

అమ్మ ఆశయం

అమ్మ ఆశయం

2016 శాసన సభ ఎన్నికల సందర్బంగా జయలలిత తమిళనాడులో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు 50 శాతం రాయితీతో స్కూటర్ లు ఇస్తామని హామీ ఇచ్చారు. జయలలిత అధికారంలోకి వచ్చిన తరువాత 50 శాతం స్కూటర్ల రాయితీ పథకానికి జయలలిత రూ. 25,000 కోట్ల నిధులు కేటాయించారు. అయితే జయలలిత ఆశయం నెరవేరక ముందే ఆమె మరణించారు.

పళని, పన్నీర్ సెల్వం

పళని, పన్నీర్ సెల్వం

జయలలిత మరణించినా ఆమె ఆశయం మరణించకూడదని నిర్ణయించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం 50 శాతం స్కూటర్ల రాయితీ పథకానికి శ్రీకారం చుట్టారు. శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 50 శాతం స్కూటర్ల రాయితీ పథకాన్ని ప్రారంభించారు.

తమిళ్ లో దంచేసిన మోడీ

తమిళ్ లో దంచేసిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలో తమిళ ప్రజలను ఉద్దేశించి తమిళంలోనే మాట్లాడుతూ తమిళ సంసృతి, సాంప్రధాయాలు అంటే తనకు ఎంతో గౌరవం అన్నారు. తమిళనాడులో ఎంతో మంది మహానుభావులు జన్మించారని, ఇలాంటి గడ్డ మీద అడుగుపెట్టడం తనకు ఎంతో ఇష్టం అని, తమిళ ప్రజలు ఇతరుల మీద ఎంతో ప్రేమ చూపిస్తారని మొత్తం తమిళ్ లోనే ప్రధాని మోడీ మాట్లాడారు.

వచ్చింది ఒకటి చెప్పింది ఒకటి !

వచ్చింది ఒకటి చెప్పింది ఒకటి !

జయలలిత కోరిక మేరకు తమిళనాడు ప్రభుత్వం 50 శాతం రాయితీ స్కూటర్ల పంపిణి పథకం ప్రారంభించింది. జయలలిత 70వ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరైనారు. అయితే ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది పనుల గురించి మాట్లాడని ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి అభివృద్ది గురించి మాట్లాడి అందరికీ ఝలక్ ఇచ్చారు.

120 శాతం ఎక్కువ

120 శాతం ఎక్కువ

యూపీఏ ప్రభుత్వం హయాంలో తమిళనాడుకు కేటాయించిన నిధుల కంటే ఎన్డీఏ ప్రభుత్వంలో 120 శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇదే సందర్బంలొ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు గురించి పూసగుచ్చినట్లు వివరించిన ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు ప్రభుత్వ పథకాల గురించి ఒక్క మాటకూడా మాట్లడకుండా అన్నాడీఎంకే ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.

జయలలిత గురించి

జయలలిత గురించి

జయలలిత జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన రూ. 25,000 కోట్ల సబ్సిడీ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ గురించి ఒక్కమాటకూడా మాట్లాడలేదు. జయలలిత తమిళనాడులో ప్రవేశ పెట్టిన పథకాలు గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క ముక్కా చెప్పలేదు.

కావేరీ సమస్య

కావేరీ సమస్య

మొదట కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తమినాడు రైతులకు అన్యాయం జరుకుండా చూడాలని, కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని బహిరంగంగా మనవి చేశారు. అయితే తరువాత మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ కావేరీ జలాల విషయం గురించి ఒక్కమాట కూడా మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడి కార్యక్రమం ముగించి జైహింద్ చెప్పేశారు.

English summary
Even though Tamil Nadu Chief Minister Edappadi Palanisamy requesting to et up Cauvery Management Board Prime Minister Narendra Modi refuse to speak up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X