వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్, టూరిజానికి బూస్ట్, బడ్జెట్‌పై ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

మినిమం గవర్నమెంట్ మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దూరదృష్టితో బడ్జెట్ రూపొందించామని, వెంటనే ఫలాలు అందబోమని పరోక్షంగా అంగీకరించారు. పల్లెలు దేశ పట్టుగొమ్మలన్నా మహాత్మా గాంధీ నినాదం మేరకు గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోడీ స్పందించారు.

Recommended Video

#Budget 2020 : New GST Policy From April !
శుభపరిణామం

శుభపరిణామం

దేశంలో 100 ఎయిర్‌పోర్టుల అభివృద్ధి మంచి చర్య అని ప్రధాని మోడీ అన్నారు. దీంతో పర్యాటక శాఖకు మేలు జరుగుతుందని గుర్తుచేశారు. తక్కువ పెట్టుబడితో పర్యాటకుల వచ్చేందుకు దోహదపడుతోందని, దీంతోపాటు ఆదాయ సమకూరుతుందని వివరించారు. వ్యవసాయం, మౌలిక వసతుల సదుపాయల కల్పన, టెక్స్ టైల్, టెక్నాలజీ విభాగంలోని ఉపాధి కల్పన కల్పించే ప్రధాన రంగాలు అని చెప్పారు. అందుకోసమే ఈ రంగాలకు బడ్జెట్‌లో సింహాభాగం పద్దులు కేటాయించామని వివరించారు.

ఇంటర్నెట్

ఇంటర్నెట్

ప్రత్యక్ష పన్నుల కోసం కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. బ్యాంకుల్లో చిన్న డిపాజిటర్లకు రక్షణ కల్పించేందుకు ఇన్సూరెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తామన ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. అంగన్ వాడీ స్కూల్, పోలీసు స్టేషన్, పాఠశాలలో కూడా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఏర్పాటు చేస్తామని వివరించారు.

5 కోట్ల వరకు నో ఆడిట్

5 కోట్ల వరకు నో ఆడిట్

మౌలిక వసతుల కల్పన కోసం భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పద్దు కేటాయించామని వివరించారు. కంపెనీలకు డివిడెంట్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చామని పేర్కొన్నారు. దీంతోపాటు రూ.5 కోట్ల టర్నో వరకు ఆడిట్ చేయబోమని చె్పారు. దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగతాయని వివరించారు.స్టార్టప్, రియల్ ఎస్టేట్ కోసం కూడా ఆలోచించామని చెప్పారు. టెక్స్‌టైల్ కోసం కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చామని ప్రధాని మోడీ చెప్పారు. మూడు దశాబ్ధాల నుంచి డిమాండ్ ఉన్న మావన నిర్మిత ఫైబర్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

 భవిష్యత్‌కు భరోసా..

భవిష్యత్‌కు భరోసా..

ప్రజోపయోగాలను మిళితం చేసి, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ బృందం ప్రతిపాదించారనిపేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఉద్దేశించి మాత్రమే పద్దు ప్రవేశపెశారని ప్రధాని మోడీ చెప్పారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భవిష్యత్‌పై భరోసా కల్పించేటట్టుగా ఉందన్నారు. నిర్మలా సీతారామన్, ఆమె బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi remarks on Budget 2020-21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X