• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మ్యాన్ వర్సెస్ వైల్డ్..ఈసారి ట్రైలర్: ఎవ్వరినైనా బాధపెట్టడం నా సంస్కృతి కాదు: నరేంద్ర మోడీ

|

న్యూఢిల్లీ: డిస్కవరీ ఛానల్ లో రెగ్యులర్ గా ప్రసారం అయ్యే ఎపిసోడ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. బ్రిటన్ కు చెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఈ ఎపిసోడ్ లో కనిపించబోతున్నారు. ఈ నెల 12వ తేదీన రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్ లో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించి ఇదివరకే ఓ ఇంట్రో ప్రొమో విడుదలైంది. తాజాగా- శుక్రవారం నాడు మరో క్లిప్ ను విడుదల చేసింది ఛానల్ యాజమాన్యం. ఇదివరకు విడుదలైన ప్రొమోతో పోల్చుకుంటే.. ఈ తాజా క్లిప్ లెంగ్త్ ఎక్కువ. 4:10 నిమిషాల నిడివి ఉన్న ప్రొమో ఇది. బిగినింగ్ టు ఎండ్.. నరేంద్ర మోడీ దాదాపు అన్ని ఫ్రేముల్లోనూ కనిపిస్తారు. ఈ ఎపిసోడ్ ద్వారా ఆయన ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తున్నారనేది ఇందులో రివీల్ చేశారు.

హింస మా విధానం కాదు..

హింస మా విధానం కాదు..

ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ లో నరేంద్ర మోడీ తన మనోగతాన్ని ఆవిష్కరించినట్టు కనిపిస్తోంది. భారతీయ తత్వాన్ని ఆయన ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారనే అనుకోవచ్చు. అప్పటికప్పుడు ఓ బల్లెంను తయారు చేసిన బేర్ గ్రిల్స్, దాన్ని మోడీ చేతికి ఇస్తూ, క్రూరమృగాలు ఎదురొస్తే.. వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరించబోగా.. హింస తమ విధానం కాదని ప్రధానమంత్రి స్పష్టం చేయడం కనిపిస్తుంది ఈ ఎపిసోడ్ లో. ఎవ్వరినైనా, దేన్నయినా బాధపెట్టడం, కొట్టడం తన సంస్కృతి కాదని వివరించారు. అందుకే తమకు ఆయుధాలతో పని లేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. దీన్ని మీ కోసం (బేర్ గ్రిల్స్) తృప్తి కోసం దగ్గర ఉంచుకుంటా..` అని నరేంద్ర మోడీ ఆ బల్లెంను చేతపట్టుకుని బయలుదేరుతారు.

నీ స్మైలే ఖల్లాస్: మరోసారి కాలర్ ఎగరేసిన సూపర్ స్టార్!

ప్రకృతికి ఎదురెళ్తే.. వినాశనమే

ప్రకృతికి ఎదురెళ్తే.. వినాశనమే

ప్రకృతిని పూజించడం భారతీయ తత్వమని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రకృతికి ఎదురెళ్తే వినాశనం తప్పదని హెచ్చరించారు. ప్రకృతిని విధ్వంసం చేయాలని మనిషి నిర్ణయం తీసుకుంటే.. అతనికి అన్నీ ప్రమాదకరంగానే కనిపిస్తాయని అన్నారు. మనిషి సైతం అత్యంత ప్రమాదకారి అని చెప్పారు. ప్రకృతిని పరిరక్షించడానికి మనం ప్రయత్నిస్తే.. అదే మనల్ని కాపాడుతుందని, పురోగమనానికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రకృతిని ప్రేమించడం తన అభిమతమని, తనకు 17-18 సంవత్సరాల వయస్సులోనే ఇంటిని వదిలేశానని, హిమాలయాల్లో గడిపానని చెప్పుకొచ్చారు. స్వచ్ఛభారత్ అంశాన్ని కూడా నరేంద్ర మోడీ ఇందులో స్పృశించినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై ఆయన బేర్ గ్రిల్స్ తో ముచ్చటించడాన్ని మనం ఈ క్లిప్ లో చూడవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత అనేది భారతీయుల రక్తంలోనే ఉందని, ఎవరో వచ్చి మన దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తమ దేశాన్ని తామే పరిశుభ్రంగా, స్పటికంలా స్వచ్ఛంగా ఉంచుకునే శక్తి సామర్థ్యాలు భారతీయులకు ఉన్నాయని కితాబిచ్చారు. స్వచ్ఛత విషయం జాతిపిత మహాత్మాగాంధీ చేసిన అకుంఠిత ప్రయత్నాలు ఫలించాయని అన్నారు.

180 దేశాల్లో ప్రసారం..

180 దేశాల్లో ప్రసారం..

ఈ ఎపిసోడ్ ప్రసారం తేదీ ఖరారైన నేపథ్యంలో.. బేర్ గ్రిల్స్ తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీపై చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ లోని కొన్ని కీలక ఘట్టాలను తీసుకుని కట్ చేసిన ప్రోమో అది. ఈ ఎపిసోడ్ మొత్తం 180 దేశాల్లో ప్రసారం కానుంది. ఆయా దేశాల ప్రజలు సరికొత్త మోడీని చూస్తారని అంటూ బేర్ గ్రిల్స్ వ్యాఖ్యానించారు. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ఈ సాహసానికి పూనుకున్నారని ప్రశంసించారు. ఈ ఎపిసోడ్ ప్రసారమైన తరువాత ప్రజలకు అడ్వెంచర్ ట్రిప్ లపై మరింత ఆసక్తి కలుగుతుందని, వన్యజీవులను సంరక్షించాలనే బాధ్యత గుర్తుకు వస్తుందని అన్నారు. ప్రకృతిని ఆరాధించడం భారతీయుల్లో పుట్టుకతోనే వచ్చిందని చెప్పారు. హిందువులు జరుపుకొనే పండుగల్లో ప్రకృతి ఓ భాగం అని ఆయన చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi will soon be seen on Bear Grylls' show Man vs Wild. In a new clip released by the makers, PM Modi talks about conservation of nature, his time in the Himalayas, cleanliness drive in India among many other things. The episode premieres on August 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more