వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 కోట్లు దాటిన ప్రధాని మోడీ ట్విట్టర్ ఫాలోవర్స్...!

|
Google Oneindia TeluguNews

దేశంలో ఇతర నాయకులెవరు దరిదాపుల్లోకి రాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా దూసుకుపోతుంది. ఇప్పటికే సోషల్ మీడీయా ఫాలోవర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉన్న మోడీ ప్రస్థుతం తన ట్విట్టర్ ఖాతాలో 50 మిలియన్ల ఫాలోవర్స్‌ మార్క్‌ను దాటారు. కాగా అమేరికా ప్రస్థుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు 64 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉండగా , అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 108 మిలియన్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉన్నారు.

ఆర్ధిక మాంద్యానికి చిదంబరం విధానాలే కారణం, ప్రధానికి లేఖ రాస్తూ సూసైడ్ చేసుకున్న రిటైర్డ్ అధికారిఆర్ధిక మాంద్యానికి చిదంబరం విధానాలే కారణం, ప్రధానికి లేఖ రాస్తూ సూసైడ్ చేసుకున్న రిటైర్డ్ అధికారి

కాగా భారత రాజకీయ నాయకులు ఎవరు కూడ మోడీ సోషల్ మీడీయా ఫాలోవర్స్‌కు దగ్గరగా కూడ లేరు. ఇక మోడీ అధికారిక ట్విట్టర్ ఖాత కూడ 30 మిలియన్ల ఫాలోవర్స్‌ను కల్గి ఉంది.కాగా ట్విట్టర్ మెయింటెన్స్‌లో ఎప్పటికప్పుడు పలు విషయాలను మోడీ పోస్టు చేస్తారు. వివిధ వేదికలలో ఆయన చేసిన ప్రసంగాల నుండి, అతను వెళ్ళిన ప్రదేశాలు మరియు ఆయన కలిసిన వ్యక్తుల వివరాలను సైతం ప్రధాని తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఉంటారు.

Prime Minister Narendra Modi Twitter followers crossing 50 million-mark,

ప్రధాని మోడీ 2009 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్విట్టర్ ఖాతను ఉపయోగించడం ప్రారంభించాడు ఈనేపథ్యంలోనే 2014 లో ప్రధాని పదవిని చేపట్టడంతో ట్విట్టర్ ఫాలోవర్స్ అధికమయ్యారు.ఇక గత సంవత్సరం, ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం ప్రపంచలోనే మొదటి ముగ్గురు నాయకులలో మోడీకి స్థానం దక్కింది.సోషల్ మీడీయా ఫాలోవర్స్‌కు సంబంధించి గాలప్ ఇంటర్నేషనల్ అనే సంస్థ తన వార్షిక సర్వేలో భాగంగా ప్రధానమంత్రి మోడీ ప్రపంచ నాయకులలో మూడవ స్థానంలో నిలిచారని పేర్కోంది.మొత్తం 50 దేశాలలో నిర్వహించిన ఈ సర్వేలో చైనాకు చెందిన జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అప్పటి బ్రిటిష్ ప్రధాని థెరిసా మే, ఇజ్రాయెల్‌కు చెందిన బెంజమిన్ నెతన్యాహు కంటే మోడీ కంటే ముందు వరుసలో ఉన్నట్టు సర్వే తెలిపింది.

English summary
Prime Minister Narendra Modi,continues to be the most followed Indian on Twitter with his followers crossing 50 million-mark on the microblogging site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X