వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైం మ్యాగజైన్‌లో చోటు సంపాదించుకున్న సర్థార్ పటేల్ విగ్రహం, విగ్రహాన్ని సందర్శించాలని ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో సర్థార్ సరోవర్ డ్యామ్ వద్ద నిర్మించిన అతిపెద్ద సర్థార్ పటేల్ విగ్రహానికి టైమ్ మ్యాగజైన్‌లో చోటు దక్కింది. టైం మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని వంద విజిటింగ్ ప్రాంతాల్లో సర్థార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. సర్ధార్ పటేల్ విగ్రహాన్ని ప్రజలు వెళ్లి చూస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. దీంతో గతంలో ఎప్పుడు లేనట్టుగా సర్థార్ సరోవర్ డ్యామ్ వద్ద 134 మీటర్ల వరకు నీటీ ప్రవాహం కొనసాగుతుందని అన్నారు.

గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌లో 182 మీటర్ల అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మించి ప్రారంభించిన విషయం తెలిసిందే..ఇప్పుడు ఆప్రాంతం పర్యటక ప్రదేశంగా విలసిల్లుతోంది. రోజురోజుకు విగ్రహాన్ని వీక్షించే పర్యాటకులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని టూరిస్టు ప్రాంతాల జాబితా రూపోందించే టైం మ్యాగజైన్ లో సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కూడ చోటు సంపాదించుకుంది. దీంతో ప్రధాని మోడీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరు ఈ విగ్రహాన్ని చూసేందుకు వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఒక్కరోజే 34వేల మంది టూరిస్టులు వచ్చారని తెలిపారు.

Prime Minister Narendra Modi urged people to visit the Sardar Sarovar Dam,

కాగా ప్రతి సంవత్సరం రెండుకోట్ల మంది భారతీయులు వివిధ దేశాలను పర్యటిస్తారని అయితే.. భారత దేశంలో ఉన్న 15 ముఖ్యప్రదేశాలను కూడ వారు సందర్శించాలని ఆయన మోడీ తన ఇండిపెండెంట్ రోజున ఇచ్చే ప్రసంగంలో కోరారు. అప్పుడే దేశీయ టూరిజం నిలదొక్కుకుంటుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు టూరిజంలో భాగంగా కనీసం సరైన హోటళ్లు కూడ లేవని చెప్పిన ఆయన టూరిస్టూలు సందర్శన మొదలైతే సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Wednesday urged people to visit the Sardar Sarovar Dam in Gujarat and hoped that those visiting the super structure will also go to the Statue of Unity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X