వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గయ బుద్ధుని సన్నిధిలో ధ్యానం చేసిన మోడీ

|
Google Oneindia TeluguNews

గయ: కృష్ణాష్టమి పర్వదినం రోజున భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ లోని బుద్ధ గయలో ప్రసిద్ధి చెందిన మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సందర్బంలో నరేంద్ర మోడీ బుద్ధుని సన్నిధిలో కొద్ది సేపు ధ్యానం చేశారు.

శనివారం గయ విమానాశ్రయంలో అంతర్జాతీయ బౌద్ధుల సంఘం కార్యదర్శి లామా లోబో జాంగ్, మహా బోధి ఆలయం వద్ద ప్రధాన అర్చకుడు భాంటీ ఛాలించా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలికారు.

Prime Minister Narendra Modi will travel to Bodh Gaya in Bihar

శనివారం నరేంద్ర మోడీ బుద్ధ గయలో పర్యటించారు. రెండు రోజుల క్రితం అంతర్జాతీయ బౌద్ధల సమావేశం ఢిల్లీలో ప్రారంభం అయ్యింది. ఈ కార్యాక్రమానికి నరేంద్ర మోడీ హాజరు కాలేదు. అయితే ఈ సమావేశం ముగింపు కార్యక్రమాలు గయలో నిర్వహిస్తున్నారు.

అంతర్జాతీయ బౌద్ధల సమావేశం ముగింపు కార్యక్రమానికి హాజరుకావడానికి నరేంద్ర మోడీ గయ వచ్చారు. నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా ప్రత్యేక రక్షణ దళానికి చెందిన 16 మంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఈ సందర్బంగా గయలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

English summary
Narendra Modi will travel to Bodh Gaya in Bihar, visiting one of the most important pilgrimage sites of Buddhists and the place where Lord Buddha obtained enlightenment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X