వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ, థ్యాంక్స్ చెప్పిన రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దానికి రాహుల్ గాంధీ కార్యాలయం కూడా ధన్యవాదాలు తెలిపింది.

రాహుల్ గాంధీ పుట్టిన రోజు జూన్ 19 తేదీ. ఆయన 1975లో జన్మించారు. ఆయన వయస్సు ప్రస్తుతం 45. 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందించారు.

Prime Minister Narendra Modi Wishes Rahul Gandhi on His Birthday

'కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలి' అని మోడీ ట్వీట్ చేశారు.

దీనికి రాహుల్ గాంధీ కార్యాలయం స్పందించింది. శుభాకాంక్షలు తెలిపిన మోడీకి ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది.

కాగా, చాలా ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీలో పుట్టిన రోజు వేడుకల నాడు ఉన్నారు. అతని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నీ సిద్ధం చేశారు. కాగా, మణిపుర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌కు కూడా మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi has extended birthday greetings to Congress Vice President Rahul Gandhi, who turned 45 today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X