వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంలతో గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..! లాక్ డౌన్ ఆంక్షలు కఠిన తరంపై దిశానిర్ధేశం..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాధి ప్రబలకుండా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే స్వీయ నియంత్రణ పాటిస్తూ లాక్ డౌన్ కు సహకరాంచాలని ప్రజలకు పలు మార్లు విజ్ఞప్తి చేసిన ప్రధాని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే దిశగా రాష్ట్రాలకు తగు సూచనలు చేస్తున్నారు. జన సమూహాలను విజయవంతంగా అడ్డుకోగలిగితే కరోనా మీద విజయం సాదిస్తామని మోదీ పలు సందర్బాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నివించారు. తాజాగా లాక్ డౌన్ పరిస్తితులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, కరోనా కేసుల తీవ్రత ఎలా ఉందనే అంశాల పై ఆరా తీసేందుకు గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

రంగంలోకి ప్రధాని.. రేపే రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కన్ఫరెన్స్..

రంగంలోకి ప్రధాని.. రేపే రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కన్ఫరెన్స్..

కరోనా మహమ్మారి విజృంభించంకుడా ఉండేందుకు అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో గురువారం కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులను ఉద్దేశించి కూడా ప్రధాని తగు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రాణాంతక వైరస్ కరోన ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ పరిస్థితిపైనా, పాజిటీవ్ కేసుల సంఖ్య పైనా ప్రధాని వివరాలు తెలుసుకోనున్నట్టు తెలుస్తోంది.

కరోన కట్టడే లక్ష్యం.. లక్షణ రేఖ దాటొద్దంటున్న కేంద్రం..

కరోన కట్టడే లక్ష్యం.. లక్షణ రేఖ దాటొద్దంటున్న కేంద్రం..

అంతే కాకుండా కరోనా వైరస్‌ కరతాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో దేశ వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అందులో బాగంగా ఇవాళ బుదవారం సాయంత్రం ప్రదాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండడం పట్ల ప్రభుత్వ వర్గాల్లో కూడా ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీ జమైతే ఉదతం కూడా దేశ ప్రజలను ఎంతగానో కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ పై ఆసక్తి నెలకొంది.

కరోనా కు భారత్ లో ప్రతికూల వాతావరణం.. ఐనా అప్రమత్తంగా ఉండాలంటున్న మోదీ..

కరోనా కు భారత్ లో ప్రతికూల వాతావరణం.. ఐనా అప్రమత్తంగా ఉండాలంటున్న మోదీ..

అంతే కాకుండా భారత దేశ బౌగోళిక పరిస్థితులు కరోన వైరస్ కు ప్రతికూలంగా ఉన్నప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ ఆంకాక్షిస్తున్నారు. ఎండాకాలం ప్రారంభమైనప్పటికి, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పట్ల ముందు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని దేశ ప్రజలకు సూచిస్తున్నారు. ఇదే కరోన నివారణపై ప్రధాని నరేంద్ర మోదీ గతంలో వీడియో కాన్ఫరెస్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. తాజాగా రేపు గురువారం కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిచి తగు సూచనలు చేయనున్నారు ప్రధాని.

ఆంక్షలు కఠినంగా అమలు చేయండి.. ముఖ్యమంత్రులకు దిశానిర్ధేశం చేయనున్న పీఎం..

ఆంక్షలు కఠినంగా అమలు చేయండి.. ముఖ్యమంత్రులకు దిశానిర్ధేశం చేయనున్న పీఎం..

అంతే కాకుండా విడియో కాన్పరెన్స్ లో ప్రజా అవసరాలకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధాని తెలుసుకోబోతున్నట్టు తెలుస్తోంది. నిత్యావసర సరుకులతో పాటు, కూరగాయలు, పాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు సూచించే అవాకాశం ఉంది. ముఖ్యంగా అపరిచితులు, విదేశాల నుంచి వచ్చివారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించబోతున్నట్టు చర్చ జరుగుతోంది. అన్నిటి కన్నా ముఖ్యమైన అంశంగా ప్రార్ధనా మందిరాలంలో ప్రార్దనల నిషేదం పట్ల దృష్టి సారించాలనే సూచన చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా రేపు సాయంత్ర మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
There has also been concern among government circles that the number of people infected with coronavirus across the country is increasing. It was in this backdrop that Modi became interested in the Chief Minister's video conference on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X