వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దు...వివాహనికి డబ్బులు పంపిన ప్రధానమంత్రి

పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహరం వివాహాలపై తీవ్రంగానే పడింది. వారణాసికి చెందిన జితేంద్రసాహు అనే చేనేత కార్మికుడు తన కూతరు వివాహం కోసం బ్యాంకులో డబ్బును దాచాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వారణాసి:పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజలు ఇంకా కష్టాలు పడుతున్నారు. వివాహలు జరపాల్సిన వారు పడుతున్న ఇబ్బందులు చెప్పడానికి పేజీలు కూడ సరిపోవు. కాని, పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహరతో వివాహం ఎలా జరిపించాలో తెలియని ఆ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదుకొన్నాడు. స్వయంగా ఆయన ఆ డబ్బును పంపి వివాహం జరిగేలా చర్యలు తీసుకొన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నియోజకవర్గం నుండి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన ఓ చేనేత కార్మికుడు తన కూతురు వివాహం కోసం ఇబ్బంది పడ్డాడు. వివాహం కోసం బ్యాంకులో నగదును దాచిపెట్టాడు.అయితే పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో వివాహం చేయడం ఆయనకు కష్టంగా మారింది.

prime minister send money to weaver daughter's marriage in varanasi

వారణాసి నియోజకవర్గానికి చెందిన జితేంద్ర సాహు అనే చేనేత కార్మికుడు తన కూతురు వివాహం చేసేందుకు ఇబ్బందులు పడ్డాడు.ఇదే అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తేవాలని భావించారు ఆయన. ఈ మేరకు తన కూతురు జ్యోతి సాహుతో ఆయన ప్రధానికి లేఖ రాయించారు.

ఈ లేఖను అందుకొన్న మోడీ వెంటనే స్పందించాడు. జితేంద్ర సాహు కూతురు వివాహం కోసం ఆర్థికసహాయం అందించాడు. ఈ మేరకు నవంబర్ 9వ, తేదిన ఆమె ప్రధానమంత్రికి లేఖ రాసింది. ఈ లేఖ రాసిన 9 రోజులకు సాహు కుటుంబం సహాయం పొందింది. జితేంద్ర సాహు కుటుంబానికి 20 వేల రూపాయాలను వారణాసి జిల్లా అధికారి వచ్చి 20 వేల రూపాయాలను అందించి వెళ్ళారు.జ్యోతి సాహు రాసిన లేఖకు స్పందించి ఈ మేరకు సహయం అందించాలని ప్రధాని నిర్ణయించారని, ఈ నిర్ణయం మేరకు డబ్బులు ఇచ్చినట్టు ఆ అధికారి చెప్పారు. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

English summary
banned currency effect on a marriage in varanasi. jitendra sahu a weaver. his decide to marry her daughter .but banned currency is problem to him. he deposited money in bank for his daughters marriage. currency ban decision on sahus family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X