బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రిన్సిపాల్ యమ స్ట్రిక్ట్.. విద్యార్థుల ఫోన్లను దంచి కొట్టారుగా..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : ఏ స్టూడెంట్‌ను చూసినా ఏమున్నది గర్వ కారణం.. సమస్త విద్యార్థుల చేతులు సెల్‌ఫోన్ మయం. ఈ ట్రెండ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. విద్యార్థులు చదువుకోవడానికి స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు కొనిస్తుంటే.. కొందరేమో సద్వినియోగం చేసుకుంటున్నారు. మరికొందరేమో టైమ్ పాస్ చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు.

ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల చేతుల్లో మొబైల్ ఫోన్లు కనిపించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కర్ణాటకలో ఓ ప్రిన్సిపాల్‌కు కోపం తెప్పించింది సెల్‌ఫోన్ల యవ్వారం. బెంగళూరులోని ఎంఈఎస్ పీయూ కాలేజీ ప్రిన్సిపాల్ యమ స్ట్రిక్ట్ అనే ప్రచారం జోరందుకుంది. విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడొద్దని పలుమార్లు చెప్పినా ఎవరు వినిపించుకోవడం లేదు. తరగతి గదుల్లోకి ఫోన్లు తెచ్చుకుంటూ డిస్ట్రబ్ చేస్తున్నారు.

యురేనియం తవ్వకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదు.. మండలిలో కేటీఆర్ వివరణయురేనియం తవ్వకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదు.. మండలిలో కేటీఆర్ వివరణ

principal smashed students mobile phones in bengaluru

అటు లెక్చరర్స్ పాఠాలు చెబుతుంటే.. ఇటు మొబైల్ ఫోన్లలో మునిగి తేలుతున్నారు విద్యార్థులు. వాట్సాప్ ఛాటింగ్‌లు ఇతరత్రా చేస్తూ అదేపనిగా ఫోన్లు వాడుతున్నారు. తరగతికి ఎందుకొచ్చామని కూడా ఆలోచించకుండా సెల్‌ఫోన్ ధ్యాస తప్ప మరొకటి లేకుండా గడిపేస్తున్నారు. ఇదంతా కూడా సదరు ప్రిన్సిపాల్‌కు కోపం తెప్పించింది.

కోపమంటే మామూలు కోపం కాదు. విద్యార్థుల నుంచి ఫోన్లు లాగేసుకుని తరగతి గదిలోని బల్లపై వాటిని సుత్తెతో దంచడం మొదలెట్టారు. ఒక్కొక్క ఫోన్ టపీటపీమని పలిగిపోతుంటే విద్యార్థులు నిశ్చేష్టులయ్యారు. ఇకపై కూడా ఫోన్లు ఎవరూ తీసుకు రావొద్దని.. కాదు కూడదని తీసుకొస్తే ఆ ఫోన్లకు కూడా ఇలాంటి గతియే పడుతుందని హెచ్చరించారు.

English summary
MES Chaitanya PU College, had repeatedly warnedh his students not to use cellphones. Some allegedly used phones even in the classroom to exchange messages. At last Principal smashed their handsets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X