వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే మా లక్ష్యం, సీఎం పదవిపై ఆమె నిర్ణయమే ఫైనల్: సోనియాతో సచిన్ పైలట్ భేటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2023లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ స్పష్టం చేశారు. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ భేటీ అయిన గంటల వ్యవధిలోనే సోనియాతో సచిన్ పైలట్ భేటీ కావడం గమనార్హం.

గెహ్లాట్ భేటీ అయిన గంటల వ్యవధిలోనే సోనియాతో సచిన్ పైలట్

గెహ్లాట్ భేటీ అయిన గంటల వ్యవధిలోనే సోనియాతో సచిన్ పైలట్

గెహ్లాట్ తన రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి "నైతిక బాధ్యత" తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఈ క్రమంలోనే పైలట్-సోనియా సమావేశం జరిగింది. కాగా, తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అనే నిర్ణయాన్ని సోనియా గాంధీ తీసుకుంటారని గెహ్లాట్ చెప్పారు.

2023 గెలుపే మా లక్ష్యమన్న సచిన్ పైలట్.. సోనియా నిర్ణయమే

2023 గెలుపే మా లక్ష్యమన్న సచిన్ పైలట్.. సోనియా నిర్ణయమే

'రాజస్థాన్‌లో ప్రతి ఐదేళ్లకోసారి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తరచుగా చర్చ జరుగుతుంది. 2023లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ వరుసగా రెండవసారి తిరిగి రాకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. మేము ఈ దిశగా కృషి చేస్తాము' అని సచిన్ పైలట్ చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ అధినేత్రి సోనియా నిర్ణయిస్తారని తెలిపారు.

రాజస్థాన్‌ సీఎం పదవికి సచిన్ పైలట్ దగ్గరగా..


ఇంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి గెహ్లాట్ పోటీలో ఉన్నందున.. పైలట్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాన్ని పెంచింది. కానీ,
రాష్ట్రంలో సాధ్యమయ్యే నాయకత్వ మార్పుపై గెహ్లాట్ విధేయులు బహిరంగంగా తిరుగుబాటు చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ సమావేశాలు జరిగాయి.

సచిన్ పైలట్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన గెహ్లాట్ వర్గం

అయితే, పైలట్ నాయకత్వాన్ని పలవురు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ మంత్రులు శాంతి ధరివాల్, మహేశ్ జోషి, ధర్మేంద్ర రాథోడ్ అనే ముగ్గురు గెహ్లాట్ విధేయులు క్రమశిక్షణా చర్యలను ఎందుకు ఎదుర్కోకూడదో 10 రోజుల్లోగా వివరించాలని పార్టీ క్రమశిక్షణా కమిటీ కోరింది. రాజస్థాన్ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఇచ్చిన నివేదికలో వారిపై "తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి" అభియోగాలు మోపిన తర్వాత ఈ పరిణామం జరిగింది.

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం.. సోనియా నిర్ణయమే ఫైనల్

జైపూర్‌లోని ధరివాల్ నివాసంలో జరిగిన సమాంతర సమావేశంలో 82 మంది ఎమ్మెల్యేలు పార్టీకి షరతులు పెట్టారు. గెహ్లాట్ వారసుడిని నియమించడానికి కాంగ్రెస్ చీఫ్‌కు అధికారం ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించడం కోసం ఏర్పాటు చేసిన అధికారిక శాసనసభా పక్ష సమావేశానికి వారు హాజరు కాలేదు.రాజస్థాన్ ఎపిసోడ్ పార్టీ ముందు ముఖ్యమైన సవాలుగా మారడంతో, కాంగ్రెస్ అధ్యక్షులు కూడా సంక్షోభాన్ని పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి గెహ్లాట్ తప్పుకోవడంతో ఆయనే రాజస్థాన్ సీఎంగా కొనసాగుతారని తెలుస్తోంది. అయితే, దీనిపై సోనియానే నిర్ణయం తీసుకుంటారని సచిన్ పైలట్ పేర్కొనడం గమనార్హం.

English summary
"Priority To Win 2023": Sachin Pilot After Meeting Sonia Gandhi, amid Rajasthan political crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X