వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేట్ పాలలో సోపు ఆయిల్, తమిళనాడులో కలకలం, గుట్టురట్టు, ఆంధ్రా పాలు అంటే !

ప్రైవేట్ పాలు చూస్తే తమిళనాడు ప్రజలు హడలిపోతున్నారు. ప్రైవేట్ పాలలో రసాయనాలు కలుపుతున్నారని తమిళనాడు మంత్రి కేటీ.

|
Google Oneindia TeluguNews

మదురై: ప్రైవేట్ పాలు చూస్తే తమిళనాడు ప్రజలు హడలిపోతున్నారు. ప్రైవేట్ పాలలో రసాయనాలు కలుపుతున్నారని తమిళనాడు మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ సంచలన వ్యావఖ్యలు చేసిన తరువాత ఆ రాష్ట్ర ప్రజలు వాటిని తీసుకోవాలంటే భయపడుతున్నారు.

<strong>దినకరన్ దెబ్బకు పళనిసామి దిమ్మ తిరిగింది: 32 మంది జంప్, మంత్రులు, ప్రభుత్వం ఫట్ !</strong>దినకరన్ దెబ్బకు పళనిసామి దిమ్మ తిరిగింది: 32 మంది జంప్, మంత్రులు, ప్రభుత్వం ఫట్ !

ఇప్పుడు ప్రైవేట్ పాలలో కల్తీ నిజమేనా ? అనే అనుమానం ఎక్కువ అయ్యింది. అందుకు అద్దంపట్టే విధంగా పరిశోధనలో ఓ వాస్తవం వెలుగు చూసింది. తమిళనాడులోని మదురై నగరంలో ప్రైవేట్ పాలలో కల్తీ జరిగిందని జిల్లా కలెక్టర్ సమక్షంలోనే వెలుగు చూసింది. వెంటనే కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

మదురైలో కలకలం

మదురైలో కలకలం

ప్రైవేట్ పాలలో రసాయనాలు కలుపుతున్నారని స్వయంగా మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ చెప్పడంతో తమిళనాడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక మదురై ప్రజలు భయాందోళనకు గురై ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మదురై కలెక్టర్ వీరరాఘవరావు జోక్యం చేసుకోవడంతో ప్రైవేట్ పాలలో కల్తీ నిజమే అని వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఎక్కడా కల్లీ కేసులు లేవు !

ఎక్కడా కల్లీ కేసులు లేవు !

రెండు మూడు వారాలుగా తమిళనాడులో ప్రైవేట్ పాలల్లో రసాయనాలు కలుపుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే మదురై ప్రజలు ఆందోళన వ్యక్తం చెయ్యడంతో పరిశోధనలు మొదలు పెట్టారు.

100 వార్డులు, 108 పాల నమూనాలు !

100 వార్డులు, 108 పాల నమూనాలు !

మదురై నగరంలో పాల పరిశోధన శిభిరం నిర్వహించారు. మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు నేతృత్వంలో పరిశోధన శిభిరంలో అధికారులు పాల్గొన్నారు. మదురై నగరంలో 100 వార్డుల నుంచి 108 పాల నమూనాలను కోవుడూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశోధన శిభిరానికి తీసుకు వచ్చారు.

కలెక్టర్ సమక్షంలోనే తెలిసింది !

కలెక్టర్ సమక్షంలోనే తెలిసింది !

మదురైలోని కోచ్చడై ప్రాంతం నుంచి తీసుకు వచ్చిన ప్రైవేట్ పాల నమూనాలో సోపు నూనె కలిపినట్లు యంత్రం ఆధారంగా అధికారులు గుర్తించారు. కలెక్టర్ వీరరాఘవరావు సమక్షంలోనే ఈ విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న కోచ్చడై ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

జిల్లా మొత్తం చూడండి !

జిల్లా మొత్తం చూడండి !

మదురై జిల్లా వ్యాప్తంగా ఐదు దశలుగా 28 బృందాలు ప్రైవేట్ పాలు పరిశోధన చెయ్యాలని కలెక్టర్ వీరరాఘవరావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పరిశోధనలు చేసి వెంటనే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వీరరాఘవరావు ఆదేశాలు జారీ చేశారు.

మాకోద్దు అంటున్న ప్రజలు !

మాకోద్దు అంటున్న ప్రజలు !

మదురై నగరంలో ప్రైవేట్ పాలలో సోపునూనె కలిపారని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోతున్నారు. ప్రైవేట్ పాల నమూనాలను ప్రామాణిక పరీక్షలకు పంపించే బాధ్యతను రమేష్ అనే అధికారికి అప్పగించారు. ఉన్నత పరిశోధనశాలకు పంపించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

నురగ ఎక్కువ రావడానికే !

నురగ ఎక్కువ రావడానికే !

పాలలో ఎక్కువ నురగ రావడానికే సోపు నూనె కల్లీ చేశారని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని సమాచారం. పాలలో సోపు నూనె కల్తీ చేశారనే వార్త నిమిషాల్లో మదురై నగరంలో వ్యాపించడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురైనారు. అన్ని జిల్లాల్లో పాల పరిశోధనలు చెయ్యాలని తమిళనాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Private milk producer from Madurai added detergent oil and distributed to the locals in Madurai. He fails the adulteration test conducted by madurai district administration today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X