వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫీజు బాదుడు: ప్రైవేట్ స్కూల్స్‌కు పర్మిషన్, ఏప్రిల్, మే నెల ట్యూషన్ పీజు వసూల్‌కు ఓకే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల పని లేకపోవడంతో ఫీజు వసూల్ చేయొద్దని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతం చండీఘడ్ మాత్రం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజు వసూల్ చేసుకోవచ్చని చెప్పింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు సర్కార్ స్పందించింది.

ఇతర చోట్ల అయితే జీతాలు తగ్గించుకొని, ఖర్చులు తక్కువ చేసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ చండీఘడ్ మాత్రం ఫీజు కలెక్ట్ చేయడానికి అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శల వ్యక్తమవుతున్నాయి. అయితే క్వార్టర్లీ కాకుండా నెలవారీగా ట్యూషన్ ఫీజు కలెక్ట్ చేయాలని మాత్రం చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతో పేరంట్స్ కూడా కొంత ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.

Private schools can now collect fees in Chandigarh

చండీఘడ్ ప్రభుత్వాన్ని ఇండిపెండెంట్ స్కూల్ అసోసియేషన్ విన్నవించింది. తమ సిబ్బందికి జీతం ఇవ్వాలని, ఇతర ఖర్చులు ఉన్నాయని తెలిపింది. వారి సమస్యకు స్పందించి.. ఫీజు వసూల్ చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే ఫైన్ వేయొద్దని మాత్రం తేల్చిచెప్పింది. మే 31 వరకు అవకాశం ఇవ్వాలని.. ఏప్రిల్, మే నెల ట్యూషన్ మాత్రమే కలెక్ట్ చేయాలని తేల్చిచెప్పింది.

English summary
Chandigarh Department of Education has recently released an order allowing private schools to collect tuition fees on a monthly basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X