వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్‌పై ఊగిపోయిన ప్రియాంక చోప్రా

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత, ఇటీవల భారతీయుల భాషపై అనుచితంగా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మండిపడ్డారు. ముస్లీంలను అమెరికాలోకి రానివ్వకుండా నిషేధం విధించాలన్న ఆయన వ్యాఖ్యలను కూడా తప్పు పట్టింది.

ఇటువంటి చ‌ర్య ఆదిమ సంస్కృతి అని ధ్వజమెత్తింది. క్లిష్ట‌మైన ఉగ్ర‌వాద నిర్మూల‌నా అంశాన్ని ఓ వ‌ర్గానికి ఆపాదిస్తూ వారిపై నిషేధం విధించ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని పేర్కొంది. ఉగ్ర‌వాదాన్ని నిరోధించే క్ర‌మంలో అమెరికాలో ముస్లింలపై నిషేధం విధించాలనుకోవ‌డం ఆదిమ చ‌ర్య‌గా అభిప్రాయపడింది.

అమెరికాలో ప్రస్తుతం తీవ్రవాదం సమస్య పైనే నడుస్తున్న క్వాంటికో అనే టీవీ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆమె, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తీవ్రవాదం అంశంపై తెరపైకి బాగా వచ్చిందని పేర్కొంది.

'ఎవరిపైనా నిషేధం విధించకూడదని అని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించి ఓ వర్గానికి చెందిన వ్యక్తుల పైనే అలాంటి వ్యాఖ్యలు చేయడ ఆదిమ చర్య. ఉగ్రవాదాన్ని అంతమొందించడం అనేది క్లిష్టమైన సమస్య. దానిని ఏ ఒక్కరికి ఆపాదించడం భావ్యం కాదు' అని ప్రియాంక చోప్రా అన్నది.

English summary
Bollywood actress Priyanka Chopra, a star of "Quantico" - an American TV series on fighting terror - has slammed Republican presidential front-runner Donald Trump's call to ban Muslim immigrants from the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X