• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆమే చాల అందమైనది, ఆమే ముఖం చాక్లెట్ లాగా ఉంటుంది

|

ఆమే చాల అందమైనది, ఆమే ముఖం చాక్లెట్ లాగా ఉంటుంది, జీన్స్ ,స్కర్ట్స్ వేసుకునే వారు రాజకీయాలు చేస్తున్నారు. ఆమే రావడం ఈ సాయంత్రానికే కలర్ ఫుల్ గా ఉంటుంది. అసలు ఆమే ఆడ ,మగా ? ఇలాంటీ వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు .ఇవి మహిళలపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న లైంగిక వేధింపులు విచక్షణ లేకుండా మాట్లాడుతున్న మాటలు ,తాజాగా ఇలాంటీవే కాంగ్రెస్ పార్టీ యూపి ఇంచార్జ్ ప్రియాంక గాంధికి తాకాయి ,ఆమే పై యూపి బీజేపీ నేతలు చేసిన లైంగిక వేధింపుల వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

ఎన్నికల వేళ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు

ఎన్నికల వేళ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు

ఎన్నికల వేళ ఎన్నో రాజకీయ విమర్శలు, ప్రత్యర్థుల మధ్య గుక్కతిప్పుకోకుండా ఆరోపణలు ,ప్రత్యారోపణలు ,ఎన్నికల్లో ఇవన్ని కామన్ , అయితే ఎన్నికల ప్రచారంలో నాయకులు వ్యక్తిగతంగా విచక్షణ కోల్పోతున్నారు.నోటి దురుసు లేక , తెలియని తనమో కాని మహిళలపై అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారు . ఒక లైంగికపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు . ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంక గాంధి కి సైతం లైంగిక వేధింపులు తప్పలేదు.

అప్పుడు జీన్స్ , ఇప్పుడు చీర, ధరిస్తున్న ప్రియాంకా గాంధి

ప్రస్తుత ఎన్నికల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల్లో నేరుగా పోటి చేయడంతో పాటు ,ఎన్నికల ప్రచారం కూడ చేస్తున్నారు .దీంతో వారిపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన బీజేపి నాయకుడు జయకరన్ ,కాంగ్రెస్ నేత ,యూపి ఈస్ట్ ఇంచార్జ్ ప్రియాంకా గాంధి పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మొదటి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధి యూపిలో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ ,మీరట్ లో జరుగుతున్న ర్యాలీని ఉద్దేశించి ఒక కాంగ్రెస్ నాయకురాలు అచ్చే దిన్ వచ్చయా అంటూ గతంలో "లంగా ధరించి ఇప్పుడు చీరలు ధరిస్తున్న నేత,గంగా జలాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు గంగను విజిట్ చేస్తున్నారంటూ ప్రియాంకా గాంధిని , ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.దీంతో అవి సోషల్ మీడియా దుమారం రేపుతున్నాయి.

గతంలో కూడ ప్రియాంకా పై లైంగికపరమైన వ్యాఖ్యలు

గతంలో కూడ ప్రియాంకా పై లైంగికపరమైన వ్యాఖ్యలు

కాగా ప్రియంకా గాంధిపై గతంలో కూడ బీజేపీ యూపి నాయకుడు హరీష్ ద్వివేది వ్యాఖ్యలు చేశారు ,ప్రియాంక గాంధి ఢిల్లిలో ఉన్నప్పుడు టాప్స్ ,జీన్స్ పాయింట్స్ వేస్తుందని, కాని గ్రామాల్లోకి వచ్చినప్పుడు చీర, బోట్టు పెట్టుకుంటుందని అన్నారు. మరో వైపు ఆమేపై బీజేపి నేషనల్ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవార్గియా కూడ ఆమేను వ్యక్తిగతంగా ,ప్రియాంక గాంధిని ఉద్దేశిస్తూ, "చాక్లెట్ ఫేస్ " అంటూ లైంగిక పరమైన వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో పలు కాంగ్రెస్ నేతలు సైతం పై వ్యాఖ్యలకు స్పందిస్తూ సజ్జన్ సింగ్ వర్మ అనే నేత అనే ప్రియాంక గాంధి లాంటీ అందమైన మహిళ బీజేపిలో లేకపోవడం దురదృష్టం అని పేర్కోన్నారు. కాగా ఇలాంటీ వ్యాఖ్యలు చాల మంది ప్రియాంక గాంధి చాల అందమైనదని అన్నారు.

కిరణ్ బేడీ ,స్మృతి ఇరాణి ని వదలని వేధింపులు

కిరణ్ బేడీ ,స్మృతి ఇరాణి ని వదలని వేధింపులు

మరో వైపు సినినటి జయప్రద పై కూడ ఇలాంటీ వ్యాఖ్యలు చేశారు. ఆమే పోటి చేస్తున్న రాంపూర్ ప్రజలకు ప్రతి సాయంత్రం కలర్ ఫుల్ కానుందని పేర్కోన్నారు.ఇలాంటీ వ్యాఖ్యలు అటు బీజేపిలోని స్మృతి ఇరాని తోపాటు పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్ బేడీ ని సైతం తాకాయి. అయితే ప్రజాస్వామ్య దేశంలో మహిళలను గౌవరవించాల్సిన నేతలే వారిపై లైంగిక పరమైన వ్యాఖ్యలు చేయడం వారి విచక్షణకే వదిలిపెట్టాలి.లేదంటే పార్టీ అధినేతలు నేరుగా వారిపై కఠిన చర్యలు చేపట్టకపోతే ఇవి ఆగే అవకాశాలు లేవు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
up bjp leader made controversy statement referring to priyanka Gandhi as Skirt -wearing women addressing a arlly in meerut ,up
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more