వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యకు మతాన్ని ముడిపెడుతారా? ప్రియాంక గాంధీ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృతం ప్రొఫెసర్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ విశ్వవిద్యాలయంలో ఓ ముస్లిం వ్యక్తిని సంస్కృతం ప్రొఫెసర్‌గా నియమించడంపై కొందరు విద్యార్థులు వ్యతిరేకించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ సదరు ముస్లిం ప్రొఫెసర్‌కు మద్దతుగా నిలిచారు.
మన భాషలు, మన సంస్కృతి.. మన ప్రత్యేకత.. అవే మనకు బలం అని ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

'సంస్కృత భాషలో విశాల దృక్పథం ఉంది. మన దేశ రాజ్యాంగం కూడా విశాల దృక్పథం కలిగివుంది. విశ్వవిద్యాలయంలో ఏ టీచర్ అయినా సంస్కృతంను బోధించవచ్చు' అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

విద్యాసంస్థల్లో బోధించే ఉపాధ్యాయులకు కూడా మత రంగు పులమడం ఏంటని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. విద్యా సంస్థలకు రాజకీయాలను అంటగట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆమె ఆరోపణలు చేశారు.

Priyanka Gandhi backs appointment of Muslim professor at BHU

కాగా, ఫిరోజ్ ఖాన్ అనే ఉపాధ్యాయుడు సంస్కృతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నియమితులయ్యారు. ఆయనను కొంత మంది విద్యార్థులు వ్యతిరేకించారు. ముస్లిం అయి ఉండి సంస్కృతం ఎలా బోధిస్తారంటూ నిరసనలు చేపట్టారు. దీంతో వివాదం రాజుకుంది.

English summary
Congress general secretary Priyanka Gandhi on Thursday came out in support of the Muslim professor whose appointment at the Banaras Hindu University's Sanskrit department has triggered a row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X