వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు రుణమాఫికి లేని డబ్బు పారీశ్రామికవేత్తలకు ఎక్కడిది ? ప్రియాంక గాంధి

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికలు మరో రెండు దశలు ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈసంధర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధి మోడీ తీరుపై మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని సిద్దార్థ్ నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమే పాల్గోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజాసమస్యలపై పట్టింపులేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి మండిపడ్డారు. రైతు రుణాలను మాఫి చేయని ప్రధానమంత్రి వేల కోట్ల రుపాయాలను పారీశ్రామిక వేత్తలకు ఎలా ఇచ్చారని ఆమే ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే మోడీ రైతులతో మాట్లాడేందుకు కూడ కనీస సమయం కూడ ఇవ్వలేదని ఆమే దుయ్యబట్టారు. దేశంలోని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం రైతులను పట్టించుకోకుండా బడా పారిశ్రామికవేత్తలకు సుమారు ఐదున్నర లక్షల కోట్ల రూపాయలను రుణమాఫి చేశారని అన్నారు. ఈనేపథ్యంలోనే మధ్య ప్రదేశ్ తోపాటు హరియాణ,పంజాబ్ రాష్ట్ర్రాలతో పాటు పలు రాష్ట్ర్రాల రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారని అన్నారు. అయిన వారితో మాట్లాడేందుకు కనీస సమయాన్ని కూడ వెచ్చించలేదని విమర్శించారు.

Priyanka Gandhi fires on pm narendra Modi

మరోవైపు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కిసాన్ సమ్మాన్ అంటూ ప్రచారం చేస్తోందని అన్నారు. మరి రైతుల రుణమాఫికి డబ్బులు లేనప్పుడు లక్షల కోట్ల రుపాయాలను పారిశ్రామిక వేత్తలకు ఎలా రుణమాఫి చేశారని ఆమే ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే రైతుల బీమా డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ఆమే అడిగారు. కాగా మోడీ స్నేహితులు ఆయన హయాంలో పదివేల కోట్ల రుపాయలు ఎలా సంపాదించారని దుయ్యాబట్టారు. ఇలా రైతులతో పాటు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా మోడీ మాత్రం వీటీని పట్టించుకోకుండా పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన మోడీ ఆయన స్వంత నియోజకవర్గంలోని ఒక్క గ్రామానికి కూడ వెళ్లలేదని విమర్శించారు. బీజేపీ హయాంలో ఉద్యోగాల హామీని కూడ నెరవేర్చలేదని ప్రియాంకా గాంధి అన్నారు.
English summary
congress Party general secretary Priyanka Gandhi has fired on pm narendra Modi In the election rally held in Uttar Pradesh,Narendra Modi does not respond on the Farmers loans issue,but how thousands of crores of rupees were giving to industrialist
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X