వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక వారణాసి ఫైట్‌పై తొలగని సస్పెన్స్! 50-50 ఛాన్స్ అంటున్న పార్టీ కేడర్!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మోడీ ప్రత్యర్థిగా ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి నుంచి ఆమె బరిలో దిగుతారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు 50 - 50 ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

గ్రాండ్ షో : మోడీ నామినేషన్‌ సర్వం సిద్ధం..అంతకంటే ముందు ఇదీ ప్రధాని షెడ్యూల్గ్రాండ్ షో : మోడీ నామినేషన్‌ సర్వం సిద్ధం..అంతకంటే ముందు ఇదీ ప్రధాని షెడ్యూల్

ఆచితూచి నిర్ణయం

ఆచితూచి నిర్ణయం

యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రియాంక పోటీ విషయంలో ఆచితూచి అడుగులేయాలని భావిస్తున్నారు. పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం నుంచి కూతురును బరిలో దింపాలన్న ఆమె ప్లాన్. అయితే ప్రిమాంక మాత్రం తనకు గెలుపోటములతో సంబంధంలేదని ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.

బరిలో ఎస్పీ బీఎస్పీ కూటమి అభ్యర్థి

బరిలో ఎస్పీ బీఎస్పీ కూటమి అభ్యర్థి

వారణాసి నుంచి ఎస్పీ బీఎస్పీ కూటమి తరఫు అభ్యర్థిగా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోడలు షాలినీ యాదవ్ పేరును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ బరిలో దిగితే మహాకూటమి అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

నామినేషన్‌కు నాలుగు రోజుల గడువు

నామినేషన్‌కు నాలుగు రోజుల గడువు

యూపీలో వారణాసి లోక్‌సభ స్థానానికి మే 19న ఎన్నిక జరగనుంది. చివరి దశ ఎన్నికలకు సంబంధించి ఈనెల 29వ తేదీతో నామినేషన్ గడువు ముగియనుంది. మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.

English summary
Priyanka Gandhi Vadra may make her electoral debut as the Congress candidate in Uttar Pradesh's Varanasi against Prime Minister Narendra Modi, in what promises to be a blockbuster contest in the national election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X