వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక కాగితపు పులి: స్మృతి, 'యూపీలో ఇక రామరాజ్యం'

యూపీలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ప్రియాంక గాంధీ కేవలం కాగితం పులి మాత్రమేనని ఎద్దేవా చేశారు. కులం, మతానికి అతీతంగా బీజేపీకి ఓట్లు వేశారన్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ప్రియాంక గాంధీ కేవలం కాగితం పులి మాత్రమేనని ఎద్దేవా చేశారు. కులం, మతానికి అతీతంగా బీజేపీకి ఓట్లు వేశారన్నారు.

యూపీ బీజేపీ అధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ.. ఇక రాష్ట్రంలో రామరాజ్యం వస్తుందన్నారు. బీజేపీకి ఉత్తర ప్రదేశ్‌లో వనవాసం పూర్తయిందని చెప్పారు.

రామజన్మభూమి సమయంలోను తమకు ఇన్ని ఓట్లు రాలేదని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. ఈ గెలుపు ప్రధాని మోడీది, నోట్ల రద్దుది అన్నారు.

యూపీ ఫలితాల తీరుతెన్నులను చూసి ఆ పార్టీ నేత సాక్షి మహారాజ్‌ స్పందించారు. ఫలితాలను చూసి నేను ఒక స్లోగన్‌ చెప్పాలనుకుంటున్నానని,అబ్‌కీబార్‌ 300 పార్‌.. ఈసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ముందుకెళుతున్నామని, ఇంకా పూర్తి కాని మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వేలను అఖిలేష్‌ యాదవ్‌ యుద్ధప్రాతిపదికన ప్రారంభించినప్పుడే ఎస్పీ ఓటమి ఖాయమని తేలిపోయిందని చెప్పారు.

Priyanka Gandhi is paper tiger: Smriti Irani on UP win

కాంగ్రెస్‌తో జతకట్టగానీ ఆయన ఓటమి ఖాయమని మరోమారు రూడీ అయిందని, ఈ ఫలితాల దెబ్బకు యూపీలో బలమైన ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని అన్నారు. యూపీలో ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారన్నారు.

ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ... ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు తిరస్కరించారని, బీఎస్పీతో విసిగిపోయారని, వారిని మళ్లీ అధికారంలోకి తీసుకెళ్లాలని అనుకోవటం లేదన్నారు.

English summary
BJP Set To Sweep The State, SP-Congress Goes Down Without A Fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X