వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా గేట్ దగ్గర ప్రియాంక బైఠాయింపు.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్

|
Google Oneindia TeluguNews

Recommended Video

CAA 2019 : Citizenship Act & NRC Are Against Poor, They Will Be Most Affected | Oneindia Telugu

పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ప్రకటించిన గంట వ్యవధిలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రంగంలోకి దూకారు. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర జరుగుతున్న నిరసనలో ప్రియాంక భాగం పంచుకున్నారు. ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వానికి, సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

డబ్బున్నోళ్లకు పాస్ పోర్టులున్నాయి.. మరి పేదలకు?
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలతో దేశంలోని పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ప్రియాంక గాంధీ చెప్పారు. ''గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించండి. ఈ రెండు చట్టాలూ పేదలవ్యతిరేక చట్టాలు. డీమానిటైజేషన్(పెద్ద నోట్ల రద్దు) లాగే పేదలందరూ క్యూలైన్లలో నిలబడి పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. డబ్బున్నోళ్ల దగ్గర పాస్ పోర్టులుంటాయి. పేదోళ్ల దగ్గర అసలు పత్రాలే ఉండవు. అంతమాత్రాన అందరినీ దేశం నుంచి వెళ్లగొడతారా?''అని ప్రియాంక ప్రశ్నించారు.

Priyanka gandhi meets anti CCA protesters at India Gate

పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరింపు
ఢిల్లీలో శుక్రవారం ఉదయం నుంచి ఆందోళనలు జరిగిన పలు ప్రాంతాల్లో సాయంత్రం సమయానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించారు. మండీ హౌజ్ నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీస్(ఐటీఓ)కు వెళ్లే దారిని పోలీసులు సీజ్ చేశారు. జయంతర్ మంతర్ కు ర్యాలీగా వెళ్తున్న పోలీసులపై గుర్తుతెలియని నిరసనకారులు రాళ్లతో దాడి చేశారని ప్రతిగా వాటర్ కెనాన్లు ప్రయోగించామని అధికారులు చెప్పారు.

English summary
CAA, NRC laws are against the poor says congress leader priyanka gandhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X