వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రశేఖర్ ఆజాద్‌ను పరామర్శించిన ప్రియాంకా గాంధీ..ఎవరీయన..?

|
Google Oneindia TeluguNews

మీరట్: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన భీమ్ ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజ్‌బబ్బర్, జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి ఆజాద్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ప్రియాంకా గాంధీ పరామర్శించారు.

నెహ్రూ నుంచి రాజీవ్ వరకు: సిక్కులను అణిచివేసేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్ నెహ్రూ నుంచి రాజీవ్ వరకు: సిక్కులను అణిచివేసేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆజాద్‌ను అతని అనుచరులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మోటార్ సైకిల్‌ను ప్రచారం కోసం వినియోగించారనే అభియోగం వీరిపై మోపారు. అరెస్టు తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను మీరట్‌లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడే ఆయన్ను అడ్మిట్ చేయడం జరిగింది.

Priyanka Gandhi meets Bhim Army chief Chandrashekhar Azad

ముజఫర్ నగర్‌లో మోటార్ సైకిళ్లు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టాలని భావించిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అతనిపై ఎన్నికల నిబంధన కోడ్ ఉల్లంఘించారనే అభియోగం మోపారు. ఆజాద్ కలిసిన తర్వాత ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని దీన్ని పెద్దదిగా చేసి చూపించొద్దని ప్రియాంకాగాంధీ అన్నారు. ఈ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని ప్రియాంకా ధ్వజమెత్తారు. యువత గొంతుకను అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని ప్రియాంకా మండిపడ్డారు.

అంతకుముందు అంటే శనివారం రోజున మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ ఆజాద్.... మహాగట్భంధన్ మోడీ, స్మృతీ ఇరానీలపై ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీకి నిలబెట్టకుంటే... భీమ్ ఆర్మీనే ఆ బాధ్యత తీసుకుని వీరిపై అభ్యర్థులను బరిలోకి నింపుతుందని అన్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాక ప్రియాంకా గాంధీ మోడీ ఇలాఖాలోనే ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు.

English summary
Congress leader Priyanka Gandhi Vadra on Wednesday met Bhim Army chief Chandrashekhar Azad, a day after he was arrested by the Uttar Pradesh Police for alleged violation of the model code of conduct.Priyanka Gandhi was accompanied by other senior Congress leaders - Raj Babbar and Jyotiraditya Scindia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X