అధికారం కోసం అడ్దదారులు.. ప్రజల మనోభావాలతో చెలగాటం : బీజేపీ, ఎస్పీలపై ప్రియాంక గాంధీ ఫైర్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇవాల్టితో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ముగింది. ఐదో దశ ఎన్నికలు జరిగే స్థానాలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సందిస్తూ ఎన్నికల పోరులో దూసుకుపోతున్నాయి. యూపీలో అన్ని తానై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆపార్టీను ముందుకు తీసుకెళ్తున్నారు.
యోగి ఇన్నాళ్లు ఎక్కడకు పోయారు..
యూపీలో బీజేపీ, ఎస్పీలు ప్రజలకు చేసిన మేలు ఏమిలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. నిరుద్యోగం, రైతులు, వ్యాపారులు, నిత్యావసర ధరల పెరుగుదల, మహిళా సాధికారత వంటి సమస్యల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఉగ్రవాదం గురించి మాట్లాడతున్నారని దుయ్యబట్టారు. యూపీలో రైతాంగం, ప్రజలు ఏండ్ల తరబడి వీధి పశువుల వీరంగంతో భాధపడుతున్నారు. కానీ ఆ విషయం ప్రధాని మోదీకి ఇప్పుడే తెలిసిందని ఎద్దేశా చేశారు. వీధి పశువుల విషయంలో సీఎం యోగి ఇప్పుడెందుకు బాధితులకు పరిహారం ప్రకటించారని నిలదీశారు. ఇన్నాళ్లు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు.

అభివృద్ధి పట్ల బీజేపీ, ఎస్పీలకు శ్రద్ధ లేదు
యూపీ అభివృద్ధి పట్ల బీజేపీ, ఎస్పీలకు శ్రద్ధ లేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. అడ్డదారుల్లోనైనా అధికారం చేపట్టాలన్నదే ఆపార్టీల లక్ష్యమని మండిపడ్డారు. ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోందని ఆరోపించారు. రైతులను నట్టేటా ముంచారని ద్వజమెత్తారు. ప్రజలు ఆర్థికంగా బలహీనంగా ఉండాలని వారు కోరుకుంటుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం గురించి ఊక దంపుడు ఉపన్యాసాలతో సీఎం యోగి బిజీగా ఉన్నారని మండిపడ్డారు. 30 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ 400 స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. ప్రజల పక్షాన ఉండేది హస్తం పార్టీయేనని భరోసా ఇచ్చారు.