వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల స్టంటే : ఆ ఘనత మీది కాదు ..? టెలిగ్రాఫ్ రిపోర్టర్‌దేనన్న విపక్షాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆ ఘనత మీది కాదు ..? టెలిగ్రాఫ్ రిపోర్టర్‌దేనన్న విపక్షాలు | Oneindia Telugu

న్యూఢిల్లీ : నీరవ్ మోదీ అరెస్ట్ ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించింది విపక్ష కాంగ్రెస్ పార్టీ. లండన్‌లో నక్కిన నీరవ్ అరెస్ట్ కేవలం ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం వేసిన ఎత్తుగడ మాత్రమని దుయ్యబట్టింది. పంజాబ్ కన్సార్షియం బ్యాంకుల నుంచి రూ.13 వేల కోట్లు తీసుకొని పారిపోయేందుకు సహకరించిందేవరని ఆ పార్టీ అధికార బీజేపీని ప్రశ్నించింది.

ప్రియాంకా గాంధీ పై స్మృతీ ఇరానీ ఫైర్.. మాజీ ప్రధాని శాస్త్రిని ప్రియాంక అవమానించారట ప్రియాంకా గాంధీ పై స్మృతీ ఇరానీ ఫైర్.. మాజీ ప్రధాని శాస్త్రిని ప్రియాంక అవమానించారట

ఎన్నికల స్టంట్

ఎన్నికల స్టంట్

నీరవ్ అరెస్ట్ .. కేంద్రం సాధించిన గొప్ప విజయమని కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, హర్దీప్ సింగ్ పూరీ వ్యాఖ్యానించడంతో విపక్ష నేతలు స్పందించారు. ఇదీ మోదీ సాధించిన ఘనత అని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో విపక్షాలు స్పందించాయి. ఎన్నికల ముందు బ్రిటన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి, నీరవ్‌ను అరెస్ట్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని ఆరోపించింది. లండన్‌లో నీరవ్ అరెస్ట్ చేస్తే, కేంద్రం ఎదో సాధించినట్టు ప్రచారం చేస్తోంది‘ అని ఆ పార్టీ యూపీ పశ్చిమ ఇంచార్జీ ప్రియాంకగాంధీ విమర్శించారు. నీరవ్ విదేశాలకు పారిపోవడంలో బీజేపీ పెద్దలు సహకరించారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఎన్నికల ముందు భారతదేశం తీసుకొచ్చి, మళ్లీ ఎన్నికల తర్వాత విదేశాలకు పంపిస్తారని అనుమానం వ్యక్తం చేశారాయన.

టెలీగ్రాఫ్ రిపోర్టర్ ఘనతే

టెలీగ్రాఫ్ రిపోర్టర్ ఘనతే

ఇన్నాళ్లు లేని ఊసేలేని అరెస్ట్ .. ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చిందని ప్రశ్నించారు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. లోక్‌సభ ఎన్నికల ముందు లబ్ధి పొందేందుకు బీజేపీ ఆడుతోన్న నాటకమని విమర్శించారు. ఆ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. లండన్‌లో నీరవ్ అరెస్ట్ ఘనత కేంద్రానిదో, మోదీది కాదన్నారు. టెలిగ్రాఫ్ పత్రిక రిపోర్టర్ వల్లే లండన్ గల్లీలో స్వేచ్ఛగా తిరుగుతోన్న నీరవ్ ఉదంతం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. కానీ కేంద్రం నీరవ్ ఆచూకీని ప్రపంచానికి తెలయజేయలేదని నొక్కవక్కానించారు.

కళ్లు మూసుకున్న సర్కార్ ?

కళ్లు మూసుకున్న సర్కార్ ?

వేల కోట్ల రుణం తీసుకొని తిరుగుతోన్న నీరవ్ మోదీ ఆచూకీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదు కానీ, మీడియాకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. అసలు నీరవ్ కోసం కేంద్రం గాలించనే లేదని విమర్శించారు. తెరవెనుక ఏం జరిగింది ? కేవలం ఎన్నికల ముందు మాత్రమే ఎందుకీ అరెస్ట్ నాటకాలు, ఈ కుతంత్రం, కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ... ఈ ఘటత అంతా బీజేపీది కాదని వారికి తెలుసు‘ అని మమతా పేర్కొన్నారు.

సేమ్ టు సేమ్ ..

సేమ్ టు సేమ్ ..

మమతా అభిప్రాయంతోనే జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఏకీభవించారు. నీరవ్ కొత్త గెటప్ ప్రపంచానికి చూపింది .. టెలీగ్రాఫ్ ప్రతినిధి తప్ప మోదీ కాదన్నారు.

English summary
Fugitive billionaire Nirav Modi’s arrest in London has not impressed opposition parties, most of whom asked how he managed to leave India in the first place and raised doubts the timing of the action just before the Lok Sabha elections. Congress leader Priyanka Gandhi Vadra, who is on a three-day tour of Uttar Pradesh, said the Narendra Modi government deserved no credit for the arrest of the PNB scam accused. “Ye achievement hai? Jaane kisne diya tha?” she asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X