వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

500 బస్సులు: వలసకూలీల కోసం పంపిన ప్రియాంక గాంధీ, పర్మిషన్ ఇవ్వని యోగి ఆదిత్యనాథ్..

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం పీక్‌కి చేరింది. కేంద్ర ప్రభుత్వంపై అధినేత్రి సోనియా సహా రాహుల్, ప్రియాంక గాంధీ తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. సాయం చేయరు కానీ.. విమర్శలు చేస్తారని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్ చేయడంతో వివాదానికి కారణమైంది. దీంతో వలసకూలీలను సొంత రాష్ట్రానికి పంపించేందుకు ప్రియాంక గాంధీ ముందుకొచ్చారు. కానీ ఆ బస్సులను సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతించలేదు.

 చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..? చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?

500 బస్సులు

500 బస్సులు

ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను యూపీ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 500 బస్సులను పంపించారు. రాజస్థాన్‌లోని మధుర వద్దకు ఖాళీ బస్సులను పంపించారు. కానీ సరిహద్దు వద్ద మాత్రం అనుమతించలేదు. అంతేకాదు బస్సుల పేరుతో ప్రియాంక గాంధీ రాజకీయాలు చేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి కాకుండా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు.

సోనియా ఫైర్

సోనియా ఫైర్

వలసకూలీలను ఆదుకునేందుకు యూపీ ప్రభుత్వం ముందుకురావడం లేదని ఇదివరకు సోనియాగాంధీ కూడా ఆరోపించారు. వలసకూలీల వివరాలు తెలియజేయాలని.. వారికి తాము బస్సు చార్జీలు అందజేస్తామని చెప్పారు. జిల్లా అధికారులు కూడా వలసకూలీల సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో లాభం లేదనుకొని కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ నంబర్ ప్రకటించింది. వలసకూలీలు, ఏ జిల్లా వారో.. ఆ నంబర్‌కు మేసేజ్ చేస్తే చాలు చార్జీ ఇస్తామని తెలిపింది.

నిర్మలా విమర్శలు

నిర్మలా విమర్శలు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ వారితో మాట్లాడారా.. వారి బ్యాగు తీసుకొని మోసారా.. అని మండిపడ్డారు. కానీ రాజకీయాలు మాత్రం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రియాంక, సోనియాలపై కూడా విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతీగా కాంగ్రెస్ కూడా ఎదరుదాడి చేసింది. అయితే వెయ్యి బస్సులను యూపీకి పంపిస్తామని ఇదివరకు యోగిని ప్రియాంక అడిగారు. కానీ ఆయన అనుమతి ఇవ్వకముందే 500 బస్సులను పంపడంతో వివాదానికి దారితీసింది.

English summary
Congress general secretary Priyanka Gandhi Vadra arranged 500 buses for the migrants stranded in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X