వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిసాన్ మహా పంచాయత్ లో పాల్గొంటానని ప్రియాంకా గాంధీ వెల్లడి.. సహరాన్‌పూర్‌లో 144 సెక్షన్

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు నవంబర్ నెల నుండి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులలో గత నవంబరు నెల నుండి అన్నదాతలు పలు రూపాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. పలు దఫాలుగా చర్చలు జరిపినా ప్రభుత్వం మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకు ససేమిరా అనడంతో, అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. చట్టాలను రద్దు చేయాలని, ఆ తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్తామని తేల్చి చెబుతున్న అన్నదాతలు ఆందోళనను కొనసాగిస్తున్నారు.

 నిన్న దీప్ సిద్ధూ .. నేడు ఇక్బాల్ సింగ్ .. ఎర్రకోట హింస కేసులో మరో నిందితుడు అరెస్ట్ నిన్న దీప్ సిద్ధూ .. నేడు ఇక్బాల్ సింగ్ .. ఎర్రకోట హింస కేసులో మరో నిందితుడు అరెస్ట్

సహరాన్ పూర్ వేదికగా కిసన్ మహా పంచాయత్.. రైతులకు ప్రియాంకా గాంధీ మద్దతు

సహరాన్ పూర్ వేదికగా కిసన్ మహా పంచాయత్.. రైతులకు ప్రియాంకా గాంధీ మద్దతు

అన్నదాతల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో అన్నదాతల ఆందోళనకు మద్దతు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ ఉద్యమాన్ని ప్రారంభించనుంది . పదిరోజుల పాటు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని భావిస్తుంది. అంతేకాదు ఈ రోజు సహరాన్ పూర్ వేదికగా జరగనున్న కిసన్ మహా పంచాయత్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొని అన్నదాతలు ఉద్యమానికి మద్దతు ప్రకటించనున్నారు.

 సహరాన్ పూర్ లో 144 సెక్షన్, కరోనా, పండుగలు , శాంతి భద్రతల కారణాలు

సహరాన్ పూర్ లో 144 సెక్షన్, కరోనా, పండుగలు , శాంతి భద్రతల కారణాలు

ప్రియాంక గాంధీ వాద్రా కిసన్ మహా పంచాయత్ లో పాల్గొననున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో నేడు సహరాన్ పూర్ లో 144 సెక్షన్ విధించింది.

రాబోయే పండుగలు, కరోనా మహమ్మారి, శాంతి భద్రతల పరిరక్షణ వంటి వివిధ కారణాలను చూపిస్తూ 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ సహరాన్పూర్ ఒక ఉత్తర్వు జారీ చేశారు . ఏప్రిల్ 5 వరకు ఉత్తరప్రదేశ్లో ఆంక్షలు విధించారు. కిసాన్ మహాపాంచాయత్ లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పర్యటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించటం చర్చనీయాంశంగా మారింది.

రైతుల ఉద్యమానికి మద్దతుగా సహరాన్ పూర్ వెళ్తానని ప్రియాంకా గాంధీ ట్వీట్

రైతుల ఉద్యమానికి మద్దతుగా సహరాన్ పూర్ వెళ్తానని ప్రియాంకా గాంధీ ట్వీట్

అంతకుముందు అన్నదాతలకు మద్దతు తెలుపుతూ ఈరోజు కిసన్ మహా పంచాయత్ లో పాల్గొంటానని ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ వాద్రా తన ట్విటర్లో ఈ విధంగా పేర్కొన్నారు. "ఈ రోజు నేను సహరాన్‌పూర్‌లో ఉంటాను, రైతులతో నా భావాలను వినడానికి, అర్థం చేసుకోవడానికి, వారి పోరాటానికి తన మద్దతు ఇస్తాను. బిజెపి ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి " అని ప్రియాంక వాద్రా ట్వీట్ చేశారు

కిసాన్ మహాపాంచాయతీకి హాజరు కావడానికి ఆమె సహరాన్ పూర్ వెళ్లనున్నారు .

ఫిబ్రవరి 13 న బిజ్నోర్, ముజఫర్ నగర్ జిల్లాల్లో రైతులను కలవాలని ప్రియాంకా ప్లాన్

ఫిబ్రవరి 13 న బిజ్నోర్, ముజఫర్ నగర్ జిల్లాల్లో రైతులను కలవాలని ప్రియాంకా ప్లాన్

ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు శకుంభ్రా దేవి ఆలయంలో పూజలు నిర్వహించి సహరాన్పూర్ వెళ్లనున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. ఫిబ్రవరి 13 న బిజ్నోర్, ముజఫర్ నగర్ జిల్లాల్లోని రైతులతో కూడా ప్రియాంక గాంధీ వాద్రా చర్చలు జరపాలని భావిస్తున్నారు.

ఇంతకుముందు రైతులు 'చక్కా జామ్' పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందోళనను ఉదృతం చేస్తున్నాయి.

ప్రియాంకా గాంధీ పర్యటన నేపధ్యంలో 144 సెక్షన్ .. ఏం జరుగుతుందో ?

ప్రియాంకా గాంధీ పర్యటన నేపధ్యంలో 144 సెక్షన్ .. ఏం జరుగుతుందో ?


కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ 26 నుంచి దేశ రాజధానిలోని వివిధ సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం సాగిస్తోంది. అయితే తాజాగా ప్రియాంక గాంధీ వాద్రా సహరాన్ పూర్ కిసాన్ మహా పంచాయత్ లో పాల్గొన్న నేపద్యంలో 144 సెక్షన్ విధించారు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రస్తుతం కనిపిస్తుంది.

English summary
Ahead of kisan mahapanchayat, Section 144 was imposed in Uttar Pradesh's Saharanpur district on Wednesday, due to various reasons including upcoming festivities, COVID-19 pandemic and law and order.District Magistrate Saharanpur issued an order citing various reasons including upcoming festivities, the spread of COVID-19 pandemic and the possibility of violence by the anti-social elements in the state. The restrictions have been imposed till April 5. The move comes ahead of the Congress General Secretary Priyanka Gandhi Vadra's visit to attend kisan mahapanchayat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X