వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినిది ఆత్మహత్యేనా?: విచారణ జరపాలంటూ యూపీ సీఎంకు ప్రియాంక గాంధీ లేఖ

|
Google Oneindia TeluguNews

లక్నో: ఓ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేఖ రాశారు. మొయిన్‌పురి భోంగావ్‌లోని జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ) ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది.

క్రూరంగా హింసించే పద్దతిని వీడండి.. మహిళా డాక్టర్ రేప్‌పై ప్రియాంక గాంధీ ఎమోషనల్క్రూరంగా హింసించే పద్దతిని వీడండి.. మహిళా డాక్టర్ రేప్‌పై ప్రియాంక గాంధీ ఎమోషనల్

ఈ ఘటనపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగిని ప్రియాంక గాంధీ కోరారు. అనుష్క పాండే(17) అనే యువతి తన హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ గదిలో ఆమె రాసిన ఓ ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 Priyanka Gandhi writes to CM Yogi, seeks probe into girl students death in JNV hostel

తమ స్నాక్స్ దొంగతనం చేశావంటూ తన గదిలో ఉంటున్న ఇతర విద్యార్థినులు ఆరోపణలు చేయడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితురాలు తన సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. తన కూతురు ఆత్మహత్యకు కారణం వీరేనంటూ స్కూల్ ప్రిన్సిపాల్ సుష్మా సాగర్, ఆ హాస్టల్ వార్డెన్, ఇంకా ఇద్దరు విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు అనుష్క తండ్రి.

తమ కూతురుది ఆత్మహత్య కాదని, హత్య అని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని ప్రియాంక గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని, ఆమె శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని చెబుతున్నారని లేఖలో ప్రస్తావించారు.

అనుష్క శరీరంపై గాయాలున్నాయి కాబట్టే పోస్టుమార్టం ర్వహించలేదని తల్లిదండ్రులు పేర్కొన్నారని తెలిపారు. స్కూల్ పరిపాలన విభాగం ఏదో దాస్తోందని, ఆమె మృతిపై పలు అనుమానాలున్నాయని.. అందుకే పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక గాంధీ తన లేఖలో కోరారు. రాష్ట్రంలోని మహిళలకు సరైన భద్రతకు సరైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నట్లు తెలిపారు.

English summary
Congress leader Priyanka Gandhi on Saturday wrote to Uttar Pradesh Chief Minister Yogi Adityanath asking him to take cognizance of the matter regarding the alleged suicide of a Class-11 girl student of the Jawahar Navodaya Vidyalaya (JNV) in Bhongaon, Mainpuri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X