వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవిష్యత్ కోసమే ప్రియాంక పార్టీ వీడారు : రణదీప్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీ వీడటంపై ఆ పార్టీ స్పందించింది. తమ నాయకత్వ తప్పిదం వల్లే ప్రియాంక పార్టీని వీడారని పేర్కొంది. ఈ పరిణామం పార్టీపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. కీలకనేతలు పార్టీని విడిచిపెట్టిన ప్రతిసారి బాధ కలుగుతోందని ఉద్ఘాటించింది.

priyanka resign congress future only : ranadeep

ఈ బాధ తీరనిది ..
ఎవరూ పార్టీని వీడినా ..తమకు బాధగానే ఉంటుందని చెప్పారు కాంగ్రెస్ కమ్యునికేషన్ ఇన్ చార్జీ రణదీప్ సింగ్ సుర్జేవాలా. ఎవరైనా తమ భవిష్యత్ కోసం అడుగులు వేస్తుంటారని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రియాంక కూడా అలానే వెళ్లిపోయారని పరోక్షంగా గుర్తుచేశారు. అలాంటి వారందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు దెబ్బే ..?
ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు. సోషల్ మీడియా క్యాంపెయిన్ లో ముందుంటారు. అలానే ఆమెకు ఫాలోవర్లు కూడా ఎక్కువే. అయితే ఎన్నికల వేళ ప్రియాంకతో గతంలో దురుసుగా ప్రవర్తించడంతో బహిష్కరించి, తిరిగి మళ్లీ చేర్చుకోవడంతో ప్రియాంక అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం చెమటోడ్చిన వారి కన్నా అలాంటి వారికే పెద్దపీట వేస్తున్నారని సోషల్ మీడియా ట్విటర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పార్టీ నుంచి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ గురువారం పంపించారు. శుక్రవారం ఉద్దవ్ సమక్షంలో శివసేన పార్టీలో చేరారు.

English summary
Priyanka Chaturvedi, the Congress spokesperson, responded to the party's resignation. Priyanka said that their leadership fault has been dropped. It is likely that the consequence will affect the party. It points out that every time the key parties leave the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X