వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకంతా తెలుసు.. కార్యకర్తలకు ప్రియాంక వార్నింగ్..

|
Google Oneindia TeluguNews

రాయ్ బరేలీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ తొలిసారి యూపీలో పర్యటించారు. తల్లి సోనియాతో కలిసి అక్కడికి వెళ్లిన ఆమె.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై అసహనంతో ఉన్న ప్రియాంక కార్యకర్తలపై మండిపడ్డారు. వారు పార్టీ గెలుపు కోసం సరిగా పనిచేయనందునే విజయం సాధించలేకపోయామని అన్నారు.

రాయ్ బరేలీ కార్యకర్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ప్రియాంక తాను నిజాలు మాట్లాడతానని, తన మాటలు కఠినంగానే ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగిందో తనకు తెలుసన్న ఆమె పార్టీ కోసం పనిచేయని కార్యకర్తలను గుర్తించి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

తుపాకీ వీడండి.. రాజ్‌భవన్‌లో భోజనం చేస్తూ చర్చిద్దాం : ఉగ్రవాదులకు కశ్మీర్ గవర్నర్ పిలుపుతుపాకీ వీడండి.. రాజ్‌భవన్‌లో భోజనం చేస్తూ చర్చిద్దాం : ఉగ్రవాదులకు కశ్మీర్ గవర్నర్ పిలుపు

Priyanka stern message to Congress workers

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది. ఆమెను పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించి.. తూర్పు యూపీ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రియాంక కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు. పార్టీ అభ్యర్థుల కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయినప్పటికీ యూపీలో రాయ్ బరేలీ మినహా మరే స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథీలోనూ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.

English summary
Congress general secretary Priyanka Gandhi Vadra admonished party workers for not doing enough during the Lok Sabha elections. Priyanka Gandhi and her mother, UPA chairperson Sonia Gandhi, visited Rae Bareli on Wednesday on a thanksgiving tour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X