• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లవ్ యూ రాహుల్, ప్రపంచంలో నీ అంత మంచి.. ప్రియాంక ట్వీట్స్

|

తన సోదరుడు రాహుల్‌గాంధీకి చెల్లి ప్రియాంక గాంధీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలిపారు. తమ చిన్నప్పటి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ప్రపంచంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరు అన్నయ్య అని ప్రియాంక ట్వీట్ చేశారు. దీపావళి తర్వాత భాయ్ దూజ్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. భాయ్ దూజ్ అంటే రాఖీ పండగ లాంటిదే.. అన్న చెల్లి, అక్క, తమ్ముడు బహుమతులను అందజేసుకుంటారు.

ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో రాహుల్, ప్రియాంక మురిపేంగా ఉన్నారు. వాటిలో కొన్నింటికీ 'లవ్ యూ @ రాహుల్ గాంధీ ' అంటూ ప్రియాంక షేర్ చేశారు. ఆ ఫోటోలు రాహుల్, ప్రియాంక ఎంత క్లోజ్‌గా ఉన్నారో అర్థమవుతుంది. భాయ్ దూజ్ సందర్భంగా తన అన్నపై తనకున్న మమకారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చాటుకున్నారు.

Priyanka tweets to wish brother Rahul on Bhai Dooj

ప్రియాంక గాంధీ చాలా ఫోటోలను షేర్ చేశారు. వాటికి తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి. వాటిలో రాఖీ పండగ సందర్భంగా తీసిన ఫోటో కూడా ఒకటి ఉంది. దానిని ట్వీట్ చేశారు. ప్రపంచంలో మంచి అన్న రాహుల్ అని ప్రియాంగ పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్న రాహుల్ గాంధీ.. తన సోదరి చేసిన ట్వీట్లతో మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చారు.

English summary
congress General Secretary Priyanka Gandhi Vadra took to Twitter to wish brother Rahul Gandhi on the occasion of Bhai dooj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X