వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ జిందాబాద్, పాక్ ఆర్మీ గ్రేట్, సోషల్ మీడియాలో వీడియో, ఇంజనీరింగ్ విద్యార్థులకు జైలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హుబ్బళి: పూల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీర జవాన్లకు దేశం మొత్తం నివాళులర్పిస్తుంటే మరో వైపు పాకిస్థాన్ సైనికులను పొగుడుతున్న పాటను పెట్టుకుని పాకిస్థాన్ జిందాబాద్ అంటూ శత్రుదేశానికి మద్దతుగా నినాదాలు చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్మార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కాలేజ్ క్యాంపస్ లోని గదిలోనే కాశ్మీర్ కు చెందిన యువకులు పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చెయ్యడంతో వారిని కాలేజ్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. నిందితులపై ఇప్పటికే దేశద్రోహం కేసు నమోదు చేసిన హుబ్బళి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !

 ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్

ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్

కర్ణాటకలోని హుబ్బళిలోని గోకుల రోడ్డులో కేఇఎల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కేఇఎల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కాశ్మీర్ కు చెందిన అమీర్, బాసిత్, తాలిబ్ అనే యువకులు బీఇ సివిల్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేస్తున్నారు. కాశ్మీర్ కు చెందిన అమీర్, బాసిత్, తాలిబ్ అదే కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న యువకులతో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఈ ముగ్గురే కలిసి తిరిగే వారని తెలిసింది.

పూల్వామా ఉగ్రదాడి జవాన్లకు నివాళి

పూల్వామా ఉగ్రదాడి జవాన్లకు నివాళి

ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం పూల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీర జవాన్లకు దేశ వ్యాప్తంగా నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు పూల్వామా దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు.

పాకిస్థాన్ జిందాబాద్, పాక్ ఆర్మీ గ్రేట్, నినాదాలు

పాకిస్థాన్ జిందాబాద్, పాక్ ఆర్మీ గ్రేట్, నినాదాలు

హుబ్బళిలోని కేఇఎల్ కాలేజ్ లో బీఇ విద్యాభ్యాసం చేస్తున్న అమీర్, బాసిత్, తాలిబ్ గదిలో కుర్చుని లాక్ చేసుకుని పాకిస్థాన్ సైనికులను పొగుడుతున్న ఓ పాట గట్టిగా పెట్టుకున్నారు. తరువాత ఆ పాటను వీరు ఆలపిస్తూ పాకిస్థాన్ కు, ఆదేశం సైనికులకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఘనకార్యం చేశారని సోషల్ మీడియాలో పోస్టు

ఘనకార్యం చేశారని సోషల్ మీడియాలో పోస్టు

పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేస్తున్న సమయంలో వీడియో తీసిన కాశ్మీర్ యువకులు మేము పెద్ద ఘనకార్యం చేశాం, మీరు చూడంటి అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం గుర్తించిన కేఇఎల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ హుబ్బళి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 సిటీ పోలీసు కమిషనర్ ఎంట్రీ

సిటీ పోలీసు కమిషనర్ ఎంట్రీ

స్వయంగా కేఇఎల్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశ్మీర్ యువకుల మీద ఫిర్యాదు చెయ్యడంతో హుబ్బళి- దారవాడ జంట నగరాల పోలీసు కమిషనర్ ఆర్. దిలీప్ విచారణ చేపట్టారు. కాశ్మీర్ యువకులు పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేశారని వెలుగు చూడటంతో వారి మీద దేశద్రోహం కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.

ఉగ్రవాదులతో లింక్ ?

ఉగ్రవాదులతో లింక్ ?

నిందితుల నుంచి మొబైల్స్, ల్యాప్ టాప్ లు, విలువైన వస్తులు స్వాధీనం చేసుకున్నామని శనివారం నగర పోలీసు కమిషనర్ దిలీప్ చెప్పారు. నిందితులకు కాశ్మీర్ లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ? ఉగ్రవాదులతో వీరికి ఏమైనా లింక్ ఉందా అని ఆరా తీస్తున్నామని నగర పోలీసు కమిషనర్ దిలీప్ స్పష్టం చేశారు. కాశ్మీర్ యువకులు ముగ్గురిని సస్పెండ్ చేశామని కేఇఎల్ కాలేజ్ యాజమాన్యం తెలిపింది.

English summary
Three Kashmiri studnets studing Civil Engineering at KLE, Hubballi are arrested and booked under sedition case. All three students are suspended from college.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X