వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పళని, పన్నీర్ పక్కా ప్లాన్: దినకరన్ క్యాంప్ ఎమ్మెల్యేలు జంప్, బెంగళూరు రిసార్ట్ కు !

అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురై తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి 23 మంది ఎమ్మెల్యేలను తన గ్రూప్ లో చేర్చుకుని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పె

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురై తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి 23 మంది ఎమ్మెల్యేలను తన గ్రూప్ లో చేర్చుకుని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న టీటీవీ దినకరన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

శశికళ పార్టీలోనే ఉండాలి, లేదంటే రాజీనామా చేస్తామని 8 మంది మంత్రులు వార్నింగ్ ?శశికళ పార్టీలోనే ఉండాలి, లేదంటే రాజీనామా చేస్తామని 8 మంది మంత్రులు వార్నింగ్ ?

పుదుచ్చేరిలోని రిసార్ట్ లో ఉన్న దినకరన్ గ్రూప్ లోని సౌందర్ రాజ్ తో సహ ఐదు మంది ఎమ్మెల్యే చిన్నగా అక్కడ నుంచి జారుకున్నారని వెలుగుచూసింది. ఐదు మంది ఎమ్మెల్యేలు జారిపోవడంతో మిగిలిన ఎమ్మెల్యేలు జంప్ కాకుండా టీటీవీ దినకరన్ జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది.

Pro TTV Dinakaran five MLAs escaped from Pudhucherry resort

పుదుచ్చేరి నుంచి ఎమ్మెల్యేలను బెంగళూరుకు మార్చాలని టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అన్నాడీఎంకే (శశికళ వర్గం) కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పూహళేందితో దినకరన్ చర్చలు జరిపి బెంగళూరు శివార్లలోని రిసార్ట్ లో ఎమ్మెల్యేలు ఉండటానికి ఏర్పాట్లు చెయ్యాలని సూచించారని తెలిసింది.

తమిళనాడు సెక్రటేరియట్ ముట్టడి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసిన విద్యార్థులు !తమిళనాడు సెక్రటేరియట్ ముట్టడి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసిన విద్యార్థులు !

పుదుచ్చేరి రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలు పారిపోలేదని, వారి సొంత నియోజక వర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు, కుటుంబ శుభకార్యాలకు హాజరుకావడానికి టీటీవీ దినకరన్ అనుమతి తీసుకుని వెళ్లారని శశికళ వర్గంలోని నాయకులు అంటున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు త్వరలో మళ్లీ మాక్యాంప్ కు వస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్లీ దినకరన్ క్యాంపకు వెళ్లకుండా చూడటానికి సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పావులు కదుపుతున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలను వీలైనంత త్వరగా మళ్లీ తన గ్రూపులోకి వచ్చే విధంగా టీటీవీ దినకరన్ తో పాటు మన్నార్ గుడి మాఫియా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

English summary
Pro TTV Dinakaran MLA Sundharraj and foure MLAs escaped from Pudhucherry resort yesterday night. Sensation between AIADMK caders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X