వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2 వేల కోసం ట్యూషన్ టీచర్‌ను ఏం చేశాడో తెలుసా..? రూ.వెయ్యితో స్నేహితులతో కలిసి షాపింగ్‌మాల్‌లో...

|
Google Oneindia TeluguNews

ముంబై : గురువు దేవునితో సమానం. విద్యాబుద్దుల చెప్పే టీచర్లకు సమాజంలో మంచి స్థానం ఉంది. కానీ కొన్నిచోట్ల గురువులు తమ స్థాయి దిగజారి ప్రవర్తిస్తుండగా .. ఇంకొన్ని చోట్ల విద్యార్థులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. ముంబై మహానగరంలో ఓ విద్యార్థి తన టీచర్‌ను హతమార్చడం కలకలం రేపింది. ఆమెను మట్టుబెట్టిన విద్యార్థి .. విచారణలో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. తమకు డబ్బులు ఇవ్వాలని, ఆమెను చంపాలని రూ.వెయ్యి మరొకరు ఇచ్చారని రకరకాలుగా వాదిస్తూ .. ఖాకీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

 దారుణం ..

దారుణం ..

ముంబై మహానగరంలో దారుణం జరిగింది. ఓ పన్నేండెళ్ల బాలుడు తన ట్యూషన్ టీచర్ .. స్కూల్ ప్రిన్సిపల్‌ను మట్టుబెట్టాడు. సోమవారం ట్యూషన్ చెప్పే సమయంలోనే ఘాతుకానికి ఒడిగట్టాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. అతనికి రూ. వెయ్యి రూపాయలు కొందరు ఇవ్వడం .. షాపింగ్ మాల్‌లో తీసుకొనే విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై పోలీసులు అతడిని ప్రశ్నిస్తుంటే తలా తోకలేని సమాధానం చెప్తున్నారు.

రూ.2 వేల కోసం ..

రూ.2 వేల కోసం ..

తొలుత విద్యార్థి తల్లికి రూ.2 వేలు ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని చెప్పాడు. అవునా నిజమా అడిగితే అవును ట్యూషన్ టీచర్‌కు తాము ఇదివరలో సాయం చేశామని పేర్కొన్నారు. ఆ డబ్బులు ఇవ్వాలని అడిగితే తనను విద్యార్థుల ముందు దూషించిందని పేర్కొన్నారు. ఆ అవమానభారం భరించలేక తానే కత్తి పొడిచానని పోలీసుల విచారణలో వెల్లడైంది.

టీచర్ చంపాలని

టీచర్ చంపాలని

ఇదే అంశంపై బాలుడి కుటుంబసభ్యులను వివరణ అడిగితే .. అదేం లేదని అతని తండ్రి చెప్పడం విశేషం. మరోవైపు తనకు ఒకరు రూ. వెయ్యి ఇచ్చారని .. టీచర్ చంపాలని కోరారని పేర్కొన్నారు. ఆమెను హతమార్చాక మరో రూ.5 వేలు ఇస్తామని చెప్పారని తెలిపారు. ఆ వెయ్యి రూపాయలతోనే తాను తన స్నేహితులతో కలిసి బర్గర్లు తిని .. వీడియో గేమ్ ఆడినట్టు వివరించారు.

రూ.వెయ్యితో షాపింగ్ ..

రూ.వెయ్యితో షాపింగ్ ..

బాలుడు చెప్పిన అంశాలను నిర్ధారించేందుకు పోలీసులు షాపింగ్ మాల్‌లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అతను స్నేహితులతో కలిసి రూ.750తో కలిసి ఫాస్ట్ ఫుడ్ కొనుగోలు చేశారని .. రూ.250తో గేమింగ్ జోన్‌లో ఆటలు ఆడాడని పేర్కొన్నారు. టీచర్ మర్డర్‌కు సంబంధించి .. అతని స్నేహితులను విచారిస్తే తమకు ఏం తెలియదని పేర్కొన్నారు. ఆదివారం తనతో రమ్మని అడిగితే వెళ్లామే తప్ప .. హత్య గురించి తెలియదన్నారు.

కనీసం మాట్లాడలేని స్థితిలో

కనీసం మాట్లాడలేని స్థితిలో

అయితే బాలుడు చెప్పినట్టు తన తల్లి రూ.2 వేలు అడిగిన దానికి సంబంధంచి ఆమెను విచారించి ధ్రువీకరించుకుందామంటే .. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉండటంతో ఈ కేసు విచారణకు ఆటంకంగా మారింది. కానీ తాము నగదు ఇవ్వలేమని .. అడగలేదని బాలుడి తండ్రి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. హత్య కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.

English summary
a 12-year-old boy was charged with murder for allegedly killing his teacher, the police said that they have found evidence that the minor had visited a mall and spent Rs 1,000, which he claimed to have received from someone who asked him to kill the woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X