వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

professor misbehave student:భార్య ఇంట్లో లేదు, విద్యార్థినికి వార్డెన్ ఫోన్.. బర్త్ డే అని...

|
Google Oneindia TeluguNews

గురువు.. కనిపించే దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం వారికే ఉంటుంది. కానీ కొందరు తమ నీచపు బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. విద్యార్థినిల పట్ల అసభ్యంగా మెలగుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరాఖండ్‌లో జరిగింది. గతనెలలో జరిగిన ఇష్యూ.. ఆలస్యంగా వెలుగుచూసింది.

 కీచక ప్రొఫెసర్..

కీచక ప్రొఫెసర్..

రుద్రపూర్‌ పరిధిలో జీబీ పాంత్ విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ విద్యార్థులు చదువుకొంటున్నారు. సిబ్బంది కూడా సరిగానే ఉన్నారు. కానీ ఓ గురువు వక్రబుద్ధి చూపించాడు. అతను హాస్టల్ వార్డెన్ విధులు కూడా నిర్వర్తించడం విశేషం. ఇదే అదనుగా భావించిన అతను.. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. హద్దుమీరి బీహెవ్ చేస్తుండగా.. అతని లీలలు ఓ విద్యార్థినికి ఫోన్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.

వేధింపులు

వేధింపులు

గత నెలలో ఓ విద్యార్థినికి వార్డెన్ మేసెజ్ పంపించాడు. అసభ్యంగా పంపడంతో ఆమె పట్టించుకోలేదు. వాస్తవానికి ఆ రోజు తన బర్త్ డే. మేసెజ్‌కు స్పందించలేదని.. పోన్ చేశాడు ఎంతకీ ఎత్తకపోవడంతో కంటిన్యూగా చేశాడు. చివరికి ఫోన్ లిప్ట్ చేయాల్సి వచ్చింది. ఫోన్ ఎత్తి హాలో అన్నదో లేదో.. తన ఇంట్లో భార్య లేదు, తనకు ఎవరు వండిపెట్టాలి అన్నాడు. దీంతో విస్తుపోవడం విద్యార్థిని వంతైపోయింది. తన ఇంటికి రావాలని, వండిపెట్టాలని కోరాడు. వార్డెన్ ప్రవర్తనతో షాక్‌నకు గురైన విద్యార్థిని.. విషయాన్ని మరునాడు వర్సిటీ వీసీకి ఫిర్యాదుచేసింది.

ఫిర్యాదు..

ఫిర్యాదు..

తనతో వార్డెన్ తప్పుగా ప్రవర్తించడాన్ని విద్యార్థిని సీరియస్‌గా తీసుకున్నారు. వైస్ చాన్స్‌లర్ నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ ముందు వార్డెన్ ప్రవర్తన గురించి ఫిర్యాదు చేశారు. వారికి మౌఖికంగా మాత్రమే ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకోవడంలో వర్సిటీ పాలకవర్గం మీనమేషాలు లెక్కించింది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని వర్సిటీ సిబ్బంది తెలిపారు. అయితే దీనిపై దుమారం చెలరేగింది. విషయం గవర్నర్ వద్దకు చేరడంతో.. అధికారులు స్పందించాల్సి వచ్చింది.

గవర్నర్ ఆరా

గవర్నర్ ఆరా

విషయం ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మయురాకు తెలిసింది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో స్టాప్ ప్రవర్తనపై మండిపడ్డారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వీసీ స్పందించారు. ఆ ప్రొఫెసర్ ఒక పోస్టింగ్ బూస్టింగ్ చేశారు. వార్డెన్‌ను పదవీ నుంచి తప్పించారు. వర్సిటీలో లేడీ వార్డెన్ నియమించాలని గవర్నర్ ఆదేశాలు జారీచేయడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. యూనివర్సిటీలో విద్యార్థినిల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్ స్పష్టంచేయడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

చర్యలు తీసుకున్నాం

చర్యలు తీసుకున్నాం

పంత్ వర్సిటీలో జరిగిన ఘటనపై చర్యలు తీసుకున్నామని రిజిస్ట్రార్ ఏపీ శర్మ పేర్కొన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. వార్డెన్ పదవీ నుంచి తప్పించినట్టు వివరించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థినిల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని తేల్చిచెప్పారు.

English summary
GB Pant University professor allegedly asked a girl student over phone to come to his home for cooking at midnight as his wife was not at home
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X